Vijay Trisha Relationship: తమిళ సినీ పరిశ్రమలో విజయ్‌, త్రిష జంటకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి విజయాలను అందుకున్నాయి. వెండితెరపై ఈ జంటకు ఉన్న కెమిస్ట్రీ అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని కలిగించింది. అయితే ఇప్పుడు సినిమాలకు మించి వీరిద్దరి వ్యక్తిగత బంధం గురించి తమిళనాట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా విజయ్‌ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది.

రాజకీయాల్లోకి విజయ్‌.. వెలుగులోకి వచ్చిన వ్యక్తిగత విభేదాలు

తమిళనాడులో టీవీకే పార్టీని స్థాపించి రాజకీయాల్లో చురుగ్గా మారిన విజయ్‌ చుట్టూ అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు కూడా ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. విజయ్‌ భార్య సంగీతతో విభేదాలు ఉన్నాయి. అంతేకాకుండా, విడాకులు కోరుతూ సంగీత కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా బట్టబయలైంది. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్‌, త్రిష మధ్య ఉన్న సంబంధం గురించి కూడా రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. సంగీతతో విభేదాలకు త్రిషతో విజయ్‌ సాన్నిహిత్యమే కారణమనే ఊహాగానాలు వినిపించాయి. తమిళనాడు ఎన్నికల్లో విజయ్‌ విజయం సాధించిన తర్వాత కూడా త్రిష పేరు తరచూ వార్తల్లో వినిపించింది. ఎన్నికల ఫలితాల అనంతరం త్రిష తిరుమలకు వెళ్లడం, ఆ తర్వాత విజయ్‌ పుట్టినరోజును ప్రత్యేకంగా నిర్వహించడం వంటి పరిణామాలు అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. ఇప్పటికే సినిమాల్లో ఈ జంటను ఎన్నోసార్లు పెళ్లి చేసుకున్నట్లుగా చూసిన అభిమానులు, నిజ జీవితంలో కూడా వీరిద్దరూ ఒక్కటవుతారా.. అంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు.

విడాకుల పిటిషన్‌ వెనక్కి తీసుకున్న సంగీత.. పెళ్లిపై ఊహాగానాలు

ఇదిలా ఉండగా, విజయ్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన భార్య సంగీత విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. దీంతో విజయ్‌ వ్యక్తిగత జీవితంపై మరోసారి చర్చ మొదలైంది. ఆ తర్వాత కొన్ని కార్యక్రమాల్లో విజయ్‌, త్రిష కలిసి కనిపించడం ఈ చర్చలకు మరింత ఆజ్యం పోసింది. ముఖ్యంగా ఆగస్టు 15న తమిళనాడులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విజయ్‌ కుటుంబ సభ్యులు కూర్చునే ప్రాంతంలోనే త్రిష కూడా కనిపించడంతో అందరి దృష్టి ఆమెపై పడింది. ఈ పరిణామం తర్వాత విజయ్‌, త్రిష త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ఇటీవల విదేశాల్లో జరిగిన ఓ కార్యక్రమానికి కూడా విజయ్‌ త్రిషతో కలిసిన వీడియోలు వైరల్‌గా మారాయి. తాజాగా వైఎస్‌ అనిల్‌రెడ్డి కుమార్తె శ్రేయారెడ్డి వివాహ వేడుకలో ఈ జంట కలిసి కనిపించడం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ ఈ వివాహ వేడుకకు త్రిషతో కలిసి హాజరయ్యారు. ఈ వేడుకలో త్రిష మెరూన్‌ రంగు చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతేకాకుండా, అక్కడికి వచ్చిన పలువురికి విజయ్‌ స్వయంగా త్రిషను పరిచయం చేశారు. దీంతో ఇద్దరి పెళ్లి వ్యవహారంపై మరోసారి చర్చకు వచ్చింది.

త్రిషను పెళ్లి చేసుకునేందుకు వెయిట్ చేస్తున్న విజయ్..?

త్రిషను అధికారికంగా వివాహం చేసుకునేందుకు విజయ్‌ ఏర్పాట్లు చేస్తున్నారనే తమిళనాడు వ్యాప్తంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం సంగీతతో విడాకుల ప్రక్రియను వేగవంతం చేయాలని తన సన్నిహితులతో విజయ్‌ చెప్పినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా, విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు విజయ్‌తో పాటు త్రిష తమిళనాడు ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోనే ఉంటారనే చర్చ కూడా నడుస్తోంది. మరోవైపు విజయ్‌, త్రిష వ్యవహారం రాజకీయంగానూ చర్చకు దారితీస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకే నేతలు ఈ అంశంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. తమిళనాడును పరిపాలించేది ముఖ్యమంత్రి విజయ్‌ కాదని, ఆయన వెనుక మరో వ్యక్తి ప్రభావం ఉందనే విమర్శలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గతంలోనూ డీఎంకే నేత, మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ఓ సభలో త్రిష పేరును నేరుగా ప్రస్తావించకుండా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో వివాదం చెలరేగి, పోలీసు కేసు నమోదు కావడం, అరెస్టు అంశం వరకు వ్యవహారం వెళ్లడం చర్చనీయాంశమైంది. చివరకు హైకోర్టు అరెస్టు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేయడంతో ఉదయనిధి స్టాలిన్‌ విడుదలయ్యారు.

సినిమాల్లో ఎన్నోసార్లు పెళ్లి.. నిజ జీవితంలో ఎప్పుడు..?

విజయ్‌, త్రిష కలిసి కనిపించిన ప్రతిసారీ తమిళనాడులో సోషల్‌ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చలు, ట్రోలింగ్స్‌ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏకంగా ఓ వివాహ వేడుకకు జంటగా హాజరుకావడం, అక్కడ విజయ్‌ త్రిషను ఇతరులకు పరిచయం చేయడం మరోసారి ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా మెరూన్‌ రంగు చీరలో త్రిష కనిపించడం, విజయ్‌తో కలిసి వేడుకలో సందడి చేయడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. దీంతో వీరిద్దరి పెళ్లి గురించి మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. వెండితెరపై ఇప్పటికే ఎన్నో సినిమాల్లో భార్యాభర్తలుగా, ప్రేమికులుగా కనిపించిన విజయ్‌, త్రిష నిజ జీవితంలో కూడా వివాహ బంధంతో ఒక్కటవుతారా..? ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎప్పుడు జరుగుతుంది.