ఒకే ఫ్రేమ్‌లో జగన్, విజయ్, కేటీఆర్
Jagan Vijay and KTR One Frame: చెన్నైలో వైఎస్ అనిల్ కుమార్తె వివాహానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, వైఎస్ జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఒకే ఫ్రేమ్‌లో జగన్, విజయ్, కేటీఆర్ కనిపించడంతో ఆసక్తికరంగా మారింది.

Jagan Vijay and KTR One Frame: చెన్నైలో జరిగిన ఓ వివాహ వేడుక ఇప్పుడు దక్షిణాది రాజకీయ, వ్యాపార వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. సాధారణంగా రాజకీయ సభలు, సమావేశాల్లో కనిపించే కీలక నేతలు.. ఎలాంటి రాజకీయ వేదిక లేకుండా ఒకే వివాహ వేడుకలో కలుసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంగరంగ వైభవంగా వైఎస్ అనిల్‌రెడ్డి కుమార్తె వివాహం
చెన్నైలోని ప్రతిష్టాత్మక లీలాప్యాలెస్‌లో వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. జగన్ బాబాయ్ వైఎస్ జార్జిరెడ్డి మనవరాలు, వైఎస్ అనిల్‌రెడ్డి కుమార్తె శ్రేయారెడ్డి వివాహం ఉజ్వల్‌తో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు వైఎస్ జగన్‌తో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిష, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. అంతేకాకుండా ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తన సతీమణితో కలిసి వివాహ వేడుకలో పాల్గొన్నారు. రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఒకే చోట చేరడంతో ఈ వివాహం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. అతికొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వేడుకకు ఇంతటి ప్రముఖులు హాజరవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
జగన్, విజయ్, కేటీఆర్ కలయికతో కొత్త రాజకీయ చర్చ
ఈ వివాహ వేడుకలో జగన్, విజయ్, కేటీఆర్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం మూడు పార్టీల అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. వైసీపీ, తమిళగ వెట్రి కళగం, బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. తమ తమ నాయకులు ఒకే వేదికపై కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో టీవీకే రాజకీయంగా అధికారంలో ఉందనే చర్చ నేపథ్యంలో, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తాయనే అంటూ ఆయా పార్టీల శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. మూడు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు ఒకే వేదికపై కనిపించడంతో ఈ అంశం రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది.
#YSJaganInChennai
Chennai, Nov 5: YSRCP President and former Chief Minister Y.S. Jagan Mohan Reddy, along with his wife Y.S. Bharathi, attended the wedding ceremony of Shreya, daughter of Y.S. Anil Reddy, held at The Leela Palace Hotel in Chennai.
YS Jagan and Bharathi blessed the newly-wed couple, Shreya and Ujwal, and extended their heartfelt wedding wishes. They wished the couple a happy, joyful and prosperous married life filled with happiness and togetherness.
Tamil Nadu Chief Minister C. Joseph Vijay, prominent industrialist Gautam Adani, BRS Working President K.T. Rama Rao, Y.S. Vijayamma, along with several prominent personalities from political and business circles and members of the family, attended the wedding celebrations.
YS Jagan and Bharathi interacted with the family members and guests during the ceremony and conveyed their best wishes to the newly-married couple as they began a new chapter in their lives.— YSR Congress Party (@YSRCParty) November 5, 2026
వైఎస్ కుటుంబ వివాహానికి అదానీ రాక.. వ్యాపార వర్గాల్లోనూ ఆసక్తి
మరోవైపు ఈ వివాహ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ హాజరు కావడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వైఎస్ అనిల్‌రెడ్డి కుమార్తె శ్రేయారెడ్డిని ప్రముఖ వ్యాపారవేత్త గోవింద్ బిలానీ కుమారుడు ఉజ్వల్‌కు ఇచ్చి వివాహం చేశారు. గోవింద్ బిలానీకి దేశవ్యాప్తంగా వ్యాపార సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ముంబయిలోని ప్రముఖ వ్యాపారవేత్తలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ వివాహ వేడుక కేవలం కుటుంబ వేడుకగానే కాకుండా రాజకీయ, వ్యాపార ప్రముఖుల కలయికగా ప్రత్యేక గుర్తింపు పొందింది. జగన్, విజయ్, కేటీఆర్ వంటి కీలక నేతలతో పాటు గౌతమ్ అదానీ కూడా ఒకే వేడుకలో పాల్గొనడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొత్తానికి చెన్నైలో జరిగిన ఈ వివాహ వేడుకలో రాజకీయ ప్రముఖుల కలయిక, ప్రముఖ పారిశ్రామికవేత్తల హాజరు ప్రత్యేక చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా జగన్, విజయ్, కేటీఆర్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాయి.
వివాహం కోసం ఏకంగా రూ.200 కోట్లు ఖర్చు…?
శ్రేయారెడ్డి వివాహ వేడుక కోసం వైఎస్ అనిల్‌రెడ్డి ఏకంగా రూ.200 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వివాహాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. పెళ్లి వేడుకల కోసం చెన్నైలోని ప్రతిష్టాత్మక లీలాప్యాలెస్ హోటల్‌ను దాదాపు 15 రోజుల పాటు పూర్తిగా బుక్ చేసినట్లు చర్చ నడుస్తోంది. వివాహానికి హాజరయ్యే కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రముఖ అతిథుల కోసం ప్రత్యేక వసతి, ఆతిథ్య సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వివాహ వేడుకలో వధూవరులు ధరించే దుస్తుల కోసం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లతో ప్రత్యేకంగా డిజైన్లు రూపొందించినట్లు సమాచారం. ఆభరణాల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, అత్యంత ఖరీదైన జ్యువెలరీని ప్రత్యేకంగా తయారు చేయించడంతో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అతిథుల ఆతిథ్యం నుంచి అలంకరణలు, దుస్తులు, ఆభరణాల వరకు ప్రతి అంశంలోనూ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. దీంతో శ్రేయారెడ్డి వివాహం కేవలం కుటుంబ వేడుకగానే కాకుండా, ఖర్చు, ఏర్పాట్లు, ప్రముఖుల హాజరు పరంగా కూడా ప్రత్యేక చర్చకు దారితీసింది.



