Pawan Kalyan Counter to Jagan

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటికే పలు దఫాలుగా చేస్తున్న వైసీపీ 2.0 హెచ్చరికలపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. వైసీపీ 2.0 అంటూ బెదిరింపులకు దిగితే NDA 10X అంటే ఏమిటో చూపిస్తామని స్ట్రాంగ్ కౌంటర్ (Pawan Kalyan Counter to Jagan)ఇచ్చారు పవన్‌. జగన్‌ బెదిరింపులకు బయపడేవారే ఇక్కడ లేరన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తాము బయపడలేదని.. ఇప్పుడు ఎలా బయపడతామన్నారు. బలహీనులు మాత్రమే బెదిరింపులకు దిగుతారని ఎద్దేవా చేశారు. బలవంతులు ఎప్పుడూ అలా చేయరని సూచించారు. ఇలాంటి మాటల వల్లే గత ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11కు పడిపోయారని.. ప్రజలకు మీమాటలు నచ్చకే తగిన గుణపాఠం చెప్పారని.. అయినా వైసీపీ నేతల తీరులో బుద్దిరాలేదని అన్నారు పవన్‌ కల్యాణ్‌. వైసీపీ 1.0 పాలనలో హింసను తాము ధైర్యంగా ఎదుర్కొన్నామని .. ప్రజలకు అండగా ఎలా నిలవాలో తమకు తెలుసన్నారు.

చంద్రబాబు సూచించినట్లుగా .. జగన్‌ ప్రజల్లోకి వస్తే వారి కష్టాలు, మనోభావాలు అర్థమవుతాయని హితవుపలికారు. రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి ఐక్యంగా ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోను సీట్ల సర్దుబాటు వంటి సంక్లిష్టతలు ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రగతి కోసం కలిసికట్టుగా ముందుకు సాగుతున్నామని పవన్‌ కల్యాణ్ చెప్పారు. రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా మాట్లాడాలి తప్ప.. హెచ్చరికలు జారీ చేయడం కరెక్ట్ కాదన్నారు. వైసీపీ నేతల(Pawan Kalyan Counter to Jagan) తీరుతో సమాజం నష్టపోతుందని.. రాష్ట్రాభివృద్ధికి అడుగడునా అడ్డుపడుతున్నారని పవన్‌ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్‌ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు మాధవ్ పాల్గొన్నారు.

రాష్ట్రంలో వైసీపీ నేతలపై కూటమి నేతలు దాడులకు పాల్పడుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్‌ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మీరు చేసిన అరాచకాలు అన్ని గుర్తుంచుకుని .. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు తిరిగి వడ్డీతో చెల్లిస్తామని.. అప్పుడు తన కార్యకర్తలకు అడ్డుచెప్పినా వారు ఆగరంటూ ఇప్పటికే పలు సార్లు జగన్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే పవన్‌ కల్యాణ్‌.. (Pawan Kalyan Counter to Jagan) జగన్‌ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.