Cyclone Arnab Threatens AP, Flights Cancelled

రేపు, ఎల్లుండి జాగ్రత్త
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ఏపీని అతలాకుతలం చేస్తోంది. ప్రజెంట్ 20 కిలోమీటర్ల వేగంగతో తీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతానికి విశాఖకు 170 కి.మీటర్లు, కాకినాడకు 140, మచిలీపట్నంకు 230, బాపట్లకు 300 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. 28వ తేదీ ఉదయానికి బాపట్ల- విశాఖ మధ్య యానాంకు సమీపంలో తుపాను తీరం దాటే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో పోలవరం, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. ఇప్పటికే విశాఖ నుంచి మొదలుకుని బాపట్ల వరకు రాష్ట్రంలో(Cyclone Arnab Threatens AP) పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే రాజమండ్రి, విశాఖ, కాకినాడ మొదలగు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఆయా నగరాలు జలమయం అయ్యాయి. పలుచోట్ల భారీ ఈదురుగాలులకు చెట్లు, కరెంట్ పోల్స్‌ విరిగిపడ్డాయి. అలర్ట్ అయిన అధికారులు వెంటనే చర్యలు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

విమానాలు రద్దు
రాష్ట్రంలో తుపాను కారణంగా విమానసర్వీసులను పూర్తిగా నిలిపివేశారు అధికారులు. భోగాపురం, నుంచి ఢిల్లీ, హైదరాబాద్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, కోల్‌కతా, చెన్నైకి వెళ్లాల్సిన 16 విమానాలను పూర్తిగా రద్దు చేశారు. మరోవైపు గన్నవరం విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే మరో 6 విమాన సర్వీసులను సైతం అధికారులు క్యాన్సిల్(Cyclone Arnab Threatens AP) చేశారు. రాష్ట్రంలో అర్నబ్ సృష్టిస్తున్న బీభత్సం కారణంగా హెంమంత్రి అనిత ప్రజలకు కీలక సూచన చేశారు. మరో రెండు రోజుల పాటు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్పా 48 గంటల పాటు బయటకు రావొద్దని కోరారు. ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని.. ప్రజలకు కూడా ప్రభుత్వానికి సహాకరించాలని కోరారు. ఎవరికైనా తుపాను కారణంగా ఇబ్బందులు తలెత్తితే వెంటనే మీమీ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్స్‌కి వెళ్లాలని .. అధికారులకు తెలియజేయాలని సూచించారు.

అంతా సిద్ధం
అర్నబ్‌ తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు భారీ స్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టామని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. మత్స్యకారుల బోట్లు ఇప్పటికే వెనక్కి తెప్పించామన్నారు. అత్యవసర వైద్య సేవలు చేపట్టేందుకు 1,316 అంబులెన్స్‌లు రెడీ ఉన్నాయని.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని 5వేల మంది గర్భిణీలను ఇప్పటికే గుర్తించి సమీప ఆరోగ్య కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు. విద్యుత్ అంతరాయం కలగకుండా వెనువెంటనే పునరుద్దరణ చేపట్టేందుకు 8,400మంది సిబ్బందిని రెడీగా ఉంచామన్నారు. ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ.. తుపాను(Cyclone Arnab Threatens AP) సన్నద్దపై ఎప్పటికప్పుడు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు 24 గంటలూ పనిచేస్తాయని, ప్రతి గంటకూ తుపాను హెచ్చరికల బులెటిన్ విడుదల చేస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

అధికారులకు కీలక సూచనలు 

అర్నబ్ తుపాను సన్నద్దతపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ సైతం సమీక్షించారు. కాకినాడ కలెక్టర్‌తో పవన్ స్వయంగా మాట్లాడారు. అర్నబ్(Cyclone Arnab Threatens AP) విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొవాలని సూచించారు. ఎక్కడా కూడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఇరిగేషన్‌ అధికారులతో మంత్రి నిమ్మల టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. బుడమేరు, ఏలేరు రిజర్వాయర్ క్యాచ్‌మెంట్ ఏరియాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. బుడమేరులో నీటి అడ్డంకులు లేకండా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాను ప్రభావంతో ఏలేరు రిజర్వాయర్‌కి వచ్చే వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసి నీటి నిర్వహణ చేపట్టాలన్నారు. తుపాను వల్ల ఎలాంటి పంట నష్టం జరగకుండా చూడాలని అధికారులకు మంత్రి నిమ్మల సూచించారు.