Cyclone Arnab Alert

27,28 తేదీల్లో జాగ్రత్త..!
అర్ణబ్ తుపాను ఏపీని వణికిస్తోంది. అర్ణబ్ తుపాను సోమవారం అర్ధరాత్రి తీవ్ర తుపానుగా మారుతుంది. 27న అతి తీవ్ర తుపానుగా బలపడుతోంది. అక్టోబర్ 28న ఉదయం బాపట్ల- విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 140 కి.మీటర్ల వేగంగా పెనుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాను నేపథ్యంలో విశాఖ నుంచి కృష్ణా జిల్లా వరకు 27, 28 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు(Cyclone Arnab Alert) జారీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు రెడ్‌ అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని.. తీరప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వాలను హెచ్చరించింది.

ప్రాణ, ఆస్తి నష్టం జరగకూడదు- సీఎం బాబు
అర్ణబ్ తుపానుతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపాన్‌ ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో అధికారును ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగడానికి వీల్లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని గత రెండు రోజులుగా సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశిస్తున్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వం మొదటి ప్రాథాన్యం అని అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి రెండు, మూడు గంటలకు ఒకసారి వెదర్ అప్డేట్స్‌ తీర ప్రాంత ప్రజలకు తెలియజేస్తూ వారిని అప్రమత్తం (Cyclone Arnab Alert)చేయాలని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు తీసుకుంటున్న చర్యలను టెలికాన్ఫరెన్స్‌ ద్వారా తెలుసుకుంటున్నారు.

పాఠశాలలకు సెలవులు
సోమవారం అర్ణబ్‌ తుపానుపై అధికారులతో సమీక్ష చేశారు సీఎం చంద్రబాబు. తుపాను గమనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తీవ్రతకు అనుగుణంగా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. తుపాను ప్రభావంతో కురిసే వర్షాలు, వీచే గాలులు, సంభవించే ప్రమాదాలను ముందుగానే అంచనా వేయాలన్నారు. తీర ప్రాంతం ప్రజలను వెంటనే గుర్తించి సమీపంలోని తుపాను షెల్టర్లకు తరలించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈసమీక్ష సమావేశంలో సీఎస్‌ సాయి ప్రసాద్, ఆర్టీజీఎస్, విపత్తు నిర్వహణ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, పోలీసులు ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. లోకల్‌గా వారు తీసుకుంటున్న చర్యల(Cyclone Arnab Alert)ను ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటికే NDRF, SDRF సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. తుపాను హచ్చరికల నేపథ్యంలో విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. తుపాన్ దృష్ట్యా కాకినాడ జిల్లాలో 101 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. తీర ప్రాంతాల్లోని 89వేల మందికి ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారుల బోట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండప్రాంతాల్లో ప్రజలకు ఎప్పటికప్పుడు అత్యవసర వైద్యం అందించేలా డ్రోన్‌లను సిద్ధం చేశారు. రహదారులపై కూలిన చెట్లను వెంటనే తొలగించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. పెట్రోల్ బంకుల్లో సరిఫడా నిల్వలు ఉంచామని అధికారులు చెప్పారు.

కేంద్రం ముందస్తు హెచ్చరిక
మరోవైపు అర్ణబ్ తుపాను సన్నద్దతపై జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి టి.వి సోమనాథన్‌ సమీక్ష చేశారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో మాట్లాడారు. ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు కేంద్రం తరపున ఆదేశాలు జారీ చేశారు. ఏపీ, తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తూర్పు యూపీ, బీహార్‌లపైనా తుపాను ప్రభావం ఉంటుందని చెప్పారు. తీర ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు, కంట్రోల్ రూమ్‌ల(Cyclone Arnab Alert) ఏర్పాటు చేయాలని చెప్పారు. రంగంలోకి NDRF, SDRF బృందాలు, విమానాలతో సిద్ధంగా ఉన్న ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ , కోస్ట్ గార్డ్ దళాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. విద్యుత్, సమాచార వ్యవస్థ దెబ్బతింటే యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని కేంద్రం ఆదేశించింది.