Andhra Pradesh Municipal Elections

ఉ.7గంటల నుంచి పోలింగ్ స్టార్ట్
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దం అయ్యింది. నవంబర్ 1న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 3న కౌంటింగ్ నిర్వహిస్తారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకున్నారు అధికారులు. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపలు ఎన్నికలుAndhra Pradesh Municipal Elections) ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని .. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అన్ని పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠా విజ్ఞప్తి చేశారు. ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి జిల్లాలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం, సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు పెంచామని అనిల్‌ చంద్ర పునేఠా తెలిపారు.

నిరంతరం సమీక్ష

రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా స్థానిక ఎన్నికల కోసం 36,351 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాలను హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్, నార్మల్‌గా వర్గీకరించారు. హైపర్ సెన్సిటివ్ కేంద్రాల్లో ఒక అధికారి, నలుగురు సిబ్బంది, సెన్సిటివ్ కేంద్రాల్లో 1+3 పద్ధతిలో భద్రత కల్పిస్తున్నారు. బ్యాలెట్ బాక్సుల తరలింపు, భద్రత కోసం 1,543 రూట్ మొబైల్స్‌ను ఏర్పాటు చేశారు. వీటితో పాటు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా తక్షణమే స్పందించేందుకు డీఎస్పీ, అదనపు ఎస్పీల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్సులు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులను అందుబాటులో ఉంచారు. పల్నాడు వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ఏపీ స్పెషల్ పోలీస్‌కు చెందిన 130 ప్లటూన్లను మోహరించారు. డీజీపీ కార్యాలయం నుంచి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, క్విక్ రియాక్షన్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయని పునేఠా వివరించారు.

భారీ బందోబస్త్
ఆంధ్రప్రదేశ్‌లో తొలిదశలో 100 పట్టణ స్థానిక సంస్థలు 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంస్థలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 17 మున్సిపల్ ఛైర్మన్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. 13 మేయర్, 70 మున్సిపల్ ఛైర్మన్ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. బరిలో 153 మంది మేయర్ అభ్యర్థులు, 367 మంది మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 3,942 వార్డు స్థానాలకు గానూ 755 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. పోలింగ్ జరగనున్న 3,186 వార్డుల్లో 9,742 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం ఓటర్ల సంఖ్య 99.36 లక్షలు ఉండగా.. వీరిలో మహిళా ఓటర్ల సంఖ్య 51.05 లక్షలు కాగా, 48.29 లక్షల మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఏకగ్రీవాలు మినహాయించి 11,378 కేంద్రాల్లో పోలింగ్‌ను నిర్వహించనున్నారు. ఎన్నికల పర్యవేక్షణకు 14,628 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 3,535 సమస్యాత్మక కేంద్రాలు, 2,131 అతి సమస్యాత్మక , 71 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను(Andhra Pradesh Municipal Elections) అధికారులు గుర్తించారు. ఈ ఎన్నికల్లో 13,504 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 13,504 మంది , ప్రిసైడింగ్ ఆఫీసర్లు , 51,716 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది ఉన్నారు.

530 మందిపై బైండోవర్ కేసులు
నవంబర్ 3న కౌంటింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కోసం 138 కౌంటింగ్ కేంద్రాలు, 556 కౌంటింగ్ హాళ్లు, 6,831 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ విధుల్లో 27,324 మంది అసిస్టెంట్లు పాల్గొననున్నారు. పోలింగ్‌ కేంద్రాల(Andhra Pradesh Municipal Elections) దగ్గర పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. ఇప్పటికే అవసరమైన చోట్లకు అదనపు బలగాలను తరలించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో సమస్యాత్మక వార్డుల్లో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కవాతులో భాగంగా కళా మందిర్ సెంటర్ దగ్గర పోలీసులు మానవహారంగా ఏర్పడి ప్రజలకు భరోసా ఇచ్చారు. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. మార్కాపురం జిల్లాలో 800మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ముందస్తు జాగ్రత్తగా 604 మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. 530 మందిపై బైండోవర్ కేసులు పెట్టారు. పోలింగ్ కేంద్రాలకు 100మీటర్ల పరిధిలో ఓటర్లు పోలీసు ,ఎన్నికల సిబ్బంది మినహా ఎవరూ రాకూడదన్న ఆంక్షలు ఉన్నాయి.