Jagan Sharmila Property Dispute

రాజశేఖర్‌ రెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదాలు రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే గత నాలుగేళ్లుగా జగన్.. షర్మిల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. అవి ఇప్పడు మరింత రచ్చకెక్కుతున్నాయి. గతంలో సరస్వతి పవర్‌ అండ్ ఇండ్రస్ట్రీస్ కంపెనీ షేర్ల బదిలీ, భారతి సిమెంట్స్, బెంగళలూరులోని యలహంక ప్యాలెస్ ఆస్తుల వివాదంపై బహిరంగంగా షర్మిల ఆరోపణలు చేశారు. తన తండ్రి ఉన్నప్పుడు కుటుంబ వ్యాపారాలు, ఆస్తులు తన పిల్లలు, తన అన్న పిల్లలకు న్యాయంగా పంచాలని అన్నారని.. కాని.. తనకు రావాల్సిన వాటను జగన్ సక్రమంగా ఇవ్వడం లేదని ఇప్పటికే పలుమార్లు షర్మిల ఆరోపణలు(Jagan Sharmila Property Dispute ) చేశారు. పలు విషయాల్లో కోర్టుకు కూడా వెళ్లారు. అయితే తాజాగా వీరిద్దరి మధ్య మరో వివాదానికి షర్మిల కుమార్తె అంజలి వివాహం మరింత అగ్గి రాజేసింది. బెంగళూరులోని యలహంకల ప్యాలెస్‌లో షర్మిల కుమార్తె అంజలి వివాహం గ్రాండ్‌గా చేసేందుకు షర్మిల దంపతులు ప్లాన్‌ చేశారు. వివాహ వేదిక యలహంక ప్యాలెస్ అని పెళ్లికార్డుల్లో ముద్రించి బంధుమిత్రులకు పంచేశారు. అయితే ఇక్కడే జగన్‌ తిరకాసు పెట్టారు. యలహంకలో తాను.. తన కుటుంబ జీవిస్తున్నాం కనుక సెక్యూరిటీ రీజన్స్‌ వస్తాయి.. కనుక పెళ్లి వేదిక మార్చుకోవాలని పలువురి ద్వారా షర్మిలకు జగన్‌ సూచించారు. ఆమె పట్టించుకోకపోవడంతో .. నేరుగా జగనే రంగం లోకి దిగారు. షర్మిలకు లేఖ బహిరంగ లేఖ రాశారు. యలహంక ప్యాలెస్‌లో అంజలి వివాహం చేస్తే వచ్చే సమస్యలేంటో లేఖలో జగన్ ప్రస్తావించారు. తన కూమార్తెల వివాహాల విషయంలోనైనా తన నిర్ణయం ఇదేనని చెప్పుకొచ్చారు జగన్. దీంతో రాజశేఖర్‌ రెడ్డి ఫ్యామిలీలో వివాదం మరింత రాజేసింది.

షర్మిల కుమార్తె వివాహం యలహంకలో చేసుకోవడానికి వీల్లేదంటూ జగన్‌ రాసిన లేఖపై మంత్రి నారా లోకేశ్‌ ఘాటుగా స్పందించారు. ఎవరికైనా తండ్రి తర్వాత మేనమామ అంటాం.. ప్రతి కుటుంబంలో మేనకొడలు పెళ్లి అంటే తన సొంత కూతురు పెళ్లిలా భావించి.. దగ్గరుండి మేనమామ అన్ని తానే చేసిన సందర్భాలు చూశాం. కాని పెళ్లి జరగకుండా అడ్డకునే జగన్‌ లాంటి మేనమామను ఎక్కడా చూడలేదని వివర్శించారు. షర్మిల కూమార్తె పెళ్లి తన సొంత ఇంట్లో జరగకుండా అడ్డుకుంటున్నారని లోకశ్ ఫైర్ అయ్యారు. ఆస్తుల కోసం తొడబుట్టిన చెల్లిని.. కన్న తల్లిని .. మేనకొడలిని జగన్‌ వేధిస్తున్నారని లోకేశ్‌ మండిపడ్డారు. తాజాగా జరుగుతున్న జగన్‌ తీరును చూస్తేనే స్పష్టంగా అర్ధమవుతోందని అన్నారు. దీన్నిబట్టే గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో అక్కాచెల్లమ్మలను జగన్‌ ఏవిధంగా చూసుకున్నారో అంటూ లోకేశ్‌ ఎద్దేవా చేశారు. కుటుంబ బాధ్యతలను విస్మరించి .. ఆస్తులే పరామావధిగా సొంత చెల్లెల్ని కూడా ఇబ్బందులపాలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారంటూ జగన్‌ను లోకేశ్‌ విమర్శించారు.

ఈ వివాదంలో జగన్‌, షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ పాత్ర కూడా చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు జగన్‌.. షర్మిల మధ్య జరుగుతున్న వివాదాల్లో((Jagan Sharmila Property Dispute )) విజయమ్మ షర్మిలకే సపోర్ట్ చూస్తూ వస్తున్నారు. ఇప్పుడు యలహంక ప్యాలెస్ విషయంలోను షర్మిలకే సపోర్ట్ చేస్తూ మాట్లాడినట్లు తెలుస్తోంది. గతంలోను షర్మిలకు రావాల్సిన వాటా సక్రమంగా రాలేదని విజయమ్మ ఆరోపించారు. ఏపీలో స్థానిక ఎన్నికల వేళ జగన్‌, షర్మిల మద్య ఆస్తుల వివాదం ప్రధాన చర్చనీయంశంగా మారింది. దీంతో జగన్‌ వ్యవహారశైలిని.. ఆయన నైజానికి, నిదర్శంగా చూపుతూ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు జగన్‌.. షర్మిల మధ్య జరుగుతున్న వివాదాలు ఇప్పుడు సౌత్‌ రాజకీయాల్లో హాట్‌టాఫిక్‌గా మారాయి.