ట్రోలర్స్‌పై సీరియస్.. గురుశిష్యుల మాస్ బ్యాటింగ్
రాప్తాడు ఘటనపై సినిమాను లింక్ చేస్తూ తప్పుబుతున్న వారికి వరుస కౌంటర్లు ఇస్తున్నారు డైరెక్టర్లు. సినిమాల ప్రభావం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ సోషల్‌మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.

Film Directors Slam Trolls
రాప్తాడు ఘటనపై సినిమాను లింక్ చేస్తూ తప్పుబుతున్న వారికి వరుస కౌంటర్లు ఇస్తున్నారు డైరెక్టర్లు. సినిమాల ప్రభావం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ సోషల్‌మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఇదే ఘటనపై మొన్న రామ్‌గోపాల్ వర్మ సీరియస్‌గా స్పందించగా.. తాజాగా తన సినిమాల వల్లే రాప్తాడు ఘటన జరిగిందటూ వస్తున్న విమర్శలకు డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా ఎక్స్ వేదికగా కౌంటర్(Film Directors Slam Trolls) ఇచ్చారు. దారుణ ఘటన జరిగినప్పుడు బాధితలకు సానుభూతి తెలిపడం మానేసి.. సినిమాను బలి పశువును చేస్తున్నారంటూ మండిపడ్డారు. కిరాతకమైన ఘటన జరిగినప్పుడు ముందుగా బాధితులను ఓదార్ఛాలి.. సమస్య మూలాలను అర్థం చేసుకోవాలని.. అవన్నీ వదిలేసి సినిమాను బలిపశువును చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు.
దారుణ ఘటనను చూసి బాధితల గురించి ఆందోళన చెందకుండా .. దాన్ని అడ్డంపెట్టుకుని మీ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ఘటననను మురికి సాకుగా వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ఫెయిల్ అయిన.. ఫ్రస్ట్రేషన్ లో ఉన్న కొందరు డైరెక్టర్లు, మరికొందరు నిర్మాతలు, వారికి తోడు నటీనటులు.. ఇలాంటి వారందరూ ఇతరును విమర్శించాల్సి వచ్చినప్పుడు అవకాశం దొరికినప్పుడు సంఘ సంస్కర్తలుగా మారి ఏదో దేశాన్ని ఉద్దరిస్తున్నట్లు మాట్లాడుతారని(Film Directors Slam Trolls) మండిపడ్డారు. ఇలాంటి దారుణ ఘటనలు జరిగిన్నప్పుడు బాధితులకు కావాల్సింది సానుభూతి కాని అవకాశం కాదనే తేడా తెలుసుకోండి అంటూ ఎక్స్‌లో ఘాటుగా విమర్శించారు.

ఇటీవల రామ్‌గోపాల్ వర్మ సైతం రాప్తాడు ఘటనపై స్పందించారు. సినిమాను లింక్ చేస్తున్న చేస్తున్న విమర్శలకు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. సినిమాల్లో హింసాత్మక సన్నివేశాలు యువతపై ప్రభావం చూపుతున్నాయన్న చర్చ కరెక్ట్ కాదన్నారు. సినిమాల్లో హింసను చూపించడం వల్ల సమాజంలో నేరాలు పెరుగుతున్నాయని విమర్శించడం సరికాదన్నాడు. సినిమాలపై వస్తున్న విమర్శలు సరైన దిశలో లేవంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈవిషయంలో సందీప్ రెడ్డి వంగాకు ఆర్జీవీ సపోర్ట్‌గా నిలిచారు. ఇదే క్రమంలో రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్ చేశాడు. కిడ్నాప్‌లు పెరుగుతున్నాయని రామాయణాన్ని నిందించలేము(Film Directors Slam Trolls) కదా అని అన్నారు. అలా అనడం ఎంత తప్పో.. హింస పెరుగుతోందని సినిమాలను నిందించడం కూడా అంతే తప్పని ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు ఆర్జీవీ.




