NTR Dragon Movie Makeover: సినిమాల్లో పాత్రలకు ప్రాణం పోయాలంటే నటీనటులు ఎంతగానో శ్రమించాల్సి ఉంటుంది. దర్శకుడు కోరుకున్న రూపంలో కనిపించేందుకు తమ శరీరాకృతిని మార్చుకోవడం నుంచి గడ్డం, మీసాలు, హెయిర్ స్టైల్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వరకు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంటారు. ముఖ్యంగా పాత్ర డిమాండ్ చేస్తే బరువు తగ్గడం, పెంచడం వంటివి కూడా చేస్తుంటారు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కూడా తన తదుపరి చిత్రం డ్రాగన్ (Dragon Movie) కోసం అలాంటి కఠినమైన మేకోవర్‌కే సిద్ధమయ్యారు. ఈ సినిమా కోసం ఏకంగా 15 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. డ్రాగన్ గ్లింప్స్ (Dragon Movie) విడుదలైనప్పటి నుంచి అందులో ఎన్టీఆర్ (NTR) కనిపించిన లుక్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. గత చిత్రాలతో పోలిస్తే ఆయన మరింత సన్నగా కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇంతలా బరువు తగ్గడానికి కారణమేంటని చర్చించుకున్నారు. అయితే సినిమాలో ఆయన పోషిస్తున్న పాత్రే ఈ మార్పునకు కారణమని తెలుస్తోంది.

హంతకుడి పాత్ర కోసం వెయిట్ లాస్..?

దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ను (NTR) ఓ హంతకుడి పాత్రలో చూపించబోతున్నట్లు సమాచారం. ఆ పాత్ర స్వభావానికి అనుగుణంగా ఆయన శరీరాకృతి ఉండాలని దర్శకుడు సూచించడంతో తారక్ (NTR) తన బరువును తగ్గించుకున్నారట. దాదాపు 15 కిలోలు తగ్గి పాత్రకు తగిన రూపాన్ని సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ కొత్త లుక్‌కు తగ్గట్టుగానే సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారట. యాక్షన్ కొరియోగ్రాఫర్ డిసౌజా ఈ ఫైట్స్‌ను ప్రత్యేకంగా కంపోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ ఫైట్స్‌లా కాకుండా ఎంతో సహజంగా, ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ బరువు తగ్గారని డిసౌజా (Dragon Movie) చెబుతున్నారు. అంటే కేవలం లుక్ కోసమే కాకుండా, యాక్షన్ సన్నివేశాల్లో సహజత్వం తీసుకురావడానికి కూడా ఈ మేకోవర్ ఉపయోగపడనుంది.

యమదొంగ నుంచి మొదలైన మేకోవర్ ప్రయాణం

ఎన్టీఆర్ తన కెరీర్‌లో పాత్రలకు అనుగుణంగా శరీరాకృతిని మార్చుకోవడం కొత్తేమీ కాదు. ఆయన మేకోవర్ ప్రయాణం యమదొంగ సినిమాతో మొదలైంది. అంతకుముందు బొద్దుగా కనిపిస్తూనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తారక్‌కు (NTR) రాజమౌళి ఈ సినిమాలో ఓ ఛాలెంజింగ్ పాత్రను ఇచ్చారు. ఆ పాత్ర కోసం ఎన్టీఆర్ (NTR) కూడా సవాలుగా తీసుకుని తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సినిమాలో పాత్రకు తగ్గట్టుగా తన రూపాన్ని మలచుకుంటూ వస్తున్నారు. కంత్రీ సినిమాలో అయితే చాలా సన్నగా కనిపించడంతో అప్పట్లో ఎన్టీఆర్ అభిమానులు కొంత నిరూత్సాహ పడ్డారు. ఎన్టీఆర్ ఏంటి ఇలా అయిపోయారంటూ చర్చించుకున్నారు. ఇప్పుడు మరోసారి డ్రాగన్ (Dragon Movie) సినిమా కోసం వెయిట్ లాస్ అవడం కీలకంగా మారింది.

పాత్ర కోసం ఎలాంటి మార్పుకైనా సిద్ధం

కేవలం సన్నబడటమే కాకుండా, అవసరమైనప్పుడు కండలు తిరిగిన దేహంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఎన్టీఆర్. ముఖ్యంగా టెంపర్ సినిమాలో ఆయన ఫిట్‌నెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ తర్వాత అరవింద సమేత చిత్రంలో మరోసారి నాజూగ్గా కనిపించారు. పైగా సిక్స్‌ప్యాక్‌ను చూపించడంతో అభిమానులు సంతోష పడ్డారు. ఇలా ఒక్కో సినిమాలో ఒక్కో విధమైన శరీరాకృతితో అభిమానులను అలరిస్తున్నారు. ఈసారి ప్రశాంత్ నీల్ (Dragon Movie) తన ఆలోచనలకు అనుగుణంగా డ్రాగన్ పాత్రను రూపొందించగా, అందుకు తగ్గట్టుగా ఎన్టీఆర్ తన రూపాన్ని మార్చుకున్నారు. హెయిర్ స్టైల్, గడ్డం వంటి విషయాల్లోనూ పాత్రకు తగిన మార్పులు చేసుకుంటున్నారు. మొత్తానికి డ్రాగన్ (Dragon Movie) కోసం యంగ్ టైగర్ పడుతున్న కష్టం ఆయన అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తోంది. మరి ఈ కొత్త మేకోవర్‌తో పాటు తనదైన నటన, యాక్షన్‌తో ఎన్టీఆర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.