Sabja Seeds Water Benefits: సబ్జా గింజలు ఈపేరు మీరు వినే ఉంటారు. రెగ్యులర్ గా మీ ఇళ్లలో ఉపయోగిస్తూనే ఉంటారు. అయితే సబ్జా చేసే మేలు అంతా ఇంతకాదంటా. వీటిలో ఉండే అధిక ఫైబర్, అధికంగా ఉండే పీచు పదార్థాలు గుండె జబ్బులను నియంత్రిస్తుందంటా. శరీర బరువును తగ్గించడంలోను ఇది దిట్ట. రెగ్యులర్‌గా వీటిని తీసుకుంటే అరుగుదల బాగా పెరిగి .. పేగులు ఆరోగ్యంగా ఉంటాయని తెలుస్తోంది. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిని పెరగకుండా చేస్తోంది. షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది. పళ్లు, ఎముకలను దృఢంగా ఉంచుతుంది. చర్మం పొడిబారకుండా చేస్తోంది.. ముఖం మెరిసేలా చేసి అందంగా ఉండేలా సహకరిస్తుంది. వీటిని నానాబెట్టి తీసుకుంటే తక్షణ శక్తినిస్తాయి. నీరసం పోగొడుతుంది. మెదడు పనితీరు మెరుగుపడేలా చేస్తోంది.

చియా గింజలు వీటిని నీటిలో నానబెడితే ఉబ్బి జెల్‌లాగా మారతాయి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల పదే పదే ఆకలి వేయకుండా ఉంటుంది. అతిగా తినే అలవాటు తగ్గుతుంది. షో మీరు ఆలస్యం చేయుండా డైట్‌లో తప్పక చియా గింజలను చేర్చుకోండి. అయితే చియా గింజలను అరగంట నానబెట్టిన తర్వాతే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అదీ రెండు స్పూన్లకు మించకూడదని చెబుతున్నారు. వీటిని రోజూ తాగే ఫ్రూట్‌ జ్యూస్‌లు, ప్రొటీన్‌ షేక్స్, స్మూతీస్‌లో కలిపి తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని సూచిస్తున్నారు. ఇంకేందుకు ఆలస్యం .. మీఇంట్లో లేకపోతే ఇప్పుడే తెచ్చేసుకోండి. ఆరోగ్య ప్రయోజనాలు పొందండి.