విపక్షాల ట్రాప్‌లో పడొద్దు.. రైతన్నలకు సూచన
Congress Leader V. Hanumantu on Farmers: వర్షాలు లేవు కనుక పరిస్థితులకు తగ్గట్లుగా పంటలు వేయాలని అన్నదాతలకు వీహెచ్ సూచించారు. వరి వేసి నష్టపోవద్దన్నారు. ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు Popular TV Network తో ప్రత్యేకంగా మాట్లాడారు

Congress Leader V. Hanumantu on Farmers: తెలంగాణలో కరెంట్ కష్టాలపై ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు Popular TV Network తో ప్రత్యేకంగా మాట్లాడారు. బీఆర్ఎస్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ బీఆర్ఎస్ చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎల్‌నినో ఎఫెక్ట్ కనిపిస్తుందన్నారు. ఇది దేవుడు పుట్టించిన కరువు అన్నారు. దీన్ని పొలిటికల్‌గా బీఆర్ఎస్ వాళ్లు వాడుకుంటున్నారు .. ఇది మంచి పద్దతి కాదన్నారు. కష్ట కాలంలో రాజకీయాలకు అతీతంగా రైతులకు అండగా నిలిచి.. నాలుగు మంచి మాటలు చెప్పి.. కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వర్షాలు లేవు కనుక పరిస్థితులకు తగ్గట్లుగా పంటలు వేయాలని అన్నదాతలకు వీహెచ్ సూచించారు. వరి వేసి నష్టపోవద్దన్నారు. వర్షాభావ పరిస్థితులకు తగ్గట్టుగా రైతులు పంటలు వేయాలన్నారు. ప్రజెంట్ జలాశయాల్లో నీళ్లు లేవన్నారు. తాగునీరు ఇవ్వడానికే సరిపోతాయి కనుక రైతులు అర్ధం చేసుకోవాలని సూచించారు. కరెంట్ కోతలపై ఇప్పటికే అధికారులను సీఎం హెచ్చరించారన్నారు. త్వరలోనే రైతులకు కరెంట్ కష్టాలు తీరుతాయని చెప్పారు. అన్నదాతలు సంయమనం పాటించాలని.. విపక్షాల మాయలో పడొద్దన‌్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇందిరమ్మ ప్రభుత్వం.. ఇది పేదల ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వమని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు కష్టాలు ఉండవన్నారు.


