వేప నీటితో సహజ సౌందర్యం.. మొటిమలు మటుమాయం
Neem Water for Glowing Skin: ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ముఖంపై మొటిమలు తగ్గాంటే మంచి సలహా ఇస్తున్నారు. అదేమిలేదు చాలా సింఫుల్ ట్రిక్స్ చెబుతున్నారు. వేప నీటితో మొటిమలను పూర్తిగా దూరం చేయవచ్చని . సహజ సౌందర్యం పొందడమే కాదు.. మొటిమలు మటుమాయం అవుతాయని ఆయుర్వేదం చెబుతోంది.

Neem Water for Glowing Skin: యవతను.. టీనేజ్ అమ్మాయిలను వేధిస్తున్న సమస్య మొటిమలు. సిటీలో పెరుగుతున్న కాలుష్యం ఒక కారణం అయితే.. మారుతున్న జీవనశైలి మరో కారణం. చాలా మంది తమను వేధిస్తున్న మొటిమల వల్ల బయటకు రావాలంటే.. నలుగురిలో కలిసి తిరగాలంటే ఆలోచిస్తారు. అందరూ తన ముఖం మీద ఉన్న మొటిమలను చూసి ఎగతాళిగా మాట్లాడతారేమోనని కుంగిపోతుంటున్నారు. మరికొందరైతే ధైర్యంగా ఎదుర్కొంటారు. మొటిమల సమస్య నుంచి విముక్తి పొందడానికి రకరకాల రసాయనాలు ఉపయోగిస్తారు. క్రీములు, సబ్బులను వాడుతుంటారు. కానీ వీటిని ఎక్కువ కాలం వాడితే చర్మంలోని సహజ తేమ తగ్గిపోతుంది. ఇంకా అనేక సమస్యలు తలెత్తుతాయని చర్మ వైద్యులు సూచిస్తున్నారు. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ముఖంపై మొటిమలు తగ్గాంటే మంచి సలహా ఇస్తున్నారు. అదేమిలేదు చాలా సింఫుల్ ట్రిక్స్ చెబుతున్నారు. వేప నీటితో మొటిమలను పూర్తిగా దూరం చేయవచ్చని . సహజ సౌందర్యం పొందడమే కాదు.. మొటిమలు మటుమాయం అవుతాయని ఆయుర్వేదం చెబుతోంది.
వేప ఆకును వినియోగిస్తే మొటిమలు పోయి ముఖానికి సహజమైన కాంతి వస్తుందని ఆయుర్వేదం సూచిస్తుంది. ప్రతిరోజూ ఉదయం వేప నీటితో ముఖం కడుక్కోవడం వల్ల చర్మం అందంగా ఆరోగ్యంగా ఉంటుందని.. అంతేకాదు ముఖంపై ఉన్న బ్యాక్టీరియా, ఫంగస్‌ను వేప ఆకు నాశనం చేస్తుందంట. ఈ వేపనీటితో నల్ల మచ్చలూ నయమవుతాయి. వేపలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. వీటి కారణంగా నల్ల మచ్చలు తగ్గుతాయి. అలర్జీలు, దురద నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వేప నీటిని తయారు చేసుకునేందుకు గుప్పెడు వేప ఆకులను తీసుకుని, శుభ్రంగా కడగాలి. తరువాత వాటిని ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. అంతే వేప నీరు సిద్ధమవుతుంది. దీనితో ఫేస్‌వాష్ చేసుకుంటే మొటిమలు క్రమంగా తగ్గుతాయి. ఇది ఆయుర్వేదం చెబుతున్న ట్రిక్ మాత్రమే. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనప్పటికీ.. పూర్తిగా తగ్గుతాయని చెప్పలేమంటుంది. అత్యధికంగా మొటిమలు ఉన్నావాళ్లు, గర్భిణీలు డాక్టర్ల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.



