Jeera Water for Weight Loss : జీలకర్ర. ఇది ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండే మంచి ఔషదం. మన తాతముత్తాల నుంచి వాడుతున్న మరోమంచి హౌస్‌ మెడిసిన్. దీన్ని కామన్‌గా వంటల్లో వాడుతుంటారు. జీర్ణ సంబంధిత సమస్యల ఉపశమనం కోసం ఉపయోగిస్తుంటారు. అయితే ఇటీవల కొంత మంది జీలకర్రను మరో విధంగాను ఉపయోగిస్తున్నారు. జీరా వాటర్ తాగితే బరువు తగ్గుతారనే ప్రచారం విస్తృతంగా ఉండడంతో వెయిట్ తగ్గడం కోసం జీరా వాటర్, జీరా టీ తాగేవారి సంఖ్య ఎక్కువైంది. ఉదయం.. సాయంత్రం రెగ్యులర్‌గా జీరా వాటర్, లెమన్‌ విత్ హనీ జీరా వాటర్ తీసుకుంటున్నారు. అయితే జీరా వాటర్ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందే కాని.. వెయిట్ తగ్గరని చెప్తున్నారు వైద్య నిపుణులు. సరైన డైట్ , ఎక్సర్‌సైజుతో పాటు జీరా వాటర్ తీసుకున్నప్పుడు మాత్రమే బరువు నియంత్రణలో ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. అప్పుడే మంచి ఫలితాలు లభిస్తాయంటున్నారు. కేవలం జీరా వాటర్‌ను మాత్రమే తీసుకుంటే బరువు తగ్గుతారని.. కొవ్వు కరిగిపోతుందనే వాదనకు బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం జీరా వాటర్‌ను రోజు తీసుకోవచ్చు.. కానీ ఇది పౌష్టికాహారం మాత్రేమే అని చెప్తున్నారు. శారీరక శ్రమ లేదా వైద్య సలహాలకు ప్రత్యామ్నాయం కాదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడేవారు.. మరేదైనా జబ్బుతో బాధపడేవారు డాక్టర్ సలహా తీసుకోకుండా వాడకూడదని చెప్తున్నారు.

ఇటీవల కాలంలో హెల్త్ ట్రిప్స్ పాటించే చాలా మంది ఇళ్లలో జీరా వాటర్ తాగడం రొటీన్‌ ప్రక్రియ అయిపోయింది. జీరా వాటర్ జీవక్రియను మెరుగుపరుస్తుందే కాని కంప్లీట్ వెయిట్ లాస్ చేస్తుందనడంలో ఏమాత్రం వాస్తవం లేదని నిపుణులు బల్లగుద్ది చెప్తున్నారు. (Jeera Water for Weight Loss) అలా అని ఎవరైనా చెప్తే పప్పులో కాలేసినట్లేనంటున్నారు. అయితే జీరా వాటర్ తయరు చేసుకోవడం అనేది చాలా సింఫుల్. ఒక టీస్పూన్ జీలకర్రను సుమారు రెండు కప్పుల వాటర్‌లో వేసి .. ఆనీరు సగానికి అంటే ఒక కప్పులోకి వచ్చేలా మరిగించాలి. ఆతర్వాత వడగట్టుకొని తాగాలి. ఇలా నేరుగా తాగినా పర్వాలేదు. లేదంటే కొద్దిగా నిమ్మరసం కలుపుకున్నా బాగానే ఉంటుంది. అంతేకానీ తీపికోసం తేనె కూడా చేర్చుకుంటారు కొందరు.. అలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు. మనం తాగేదే బరువు తగ్గడం కోసం.. మళ్లీ తేనె యాడ్ చేయడం వల్ల అదనపు క్యాలరీలు చేరి.. బరువు తగ్గడానికి ఎలాంటి ఆస్కారం లేదని చెప్తున్నారు. జీలకర్ర జీర్ణ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో మొనగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. (Jeera Water for Weight Loss ) జీర్ణ ఎంజైమ్‌ల పనితీరును పెంచడంతో, కొవ్వుల జీర్ణక్రియకు అవసరమైన పైత్యరసం విడుదలను ప్రోత్సహించడంలో ఇది ఎంతో సహాయం చేస్తోంది. ఆహారం సులభంగా జీర్ణమై, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ఇది అనేక అధ్యయనాలలో ఇది రిజువైంది. షో మీరు జీరా వాటర్ తాగితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు కానీ.. బరువు తగ్గుతారనడంలో మాత్రం వాస్తవం లేదు.