బరువు తగ్గడం ఇంత సులభమా…
Easy Weight Loss Tips: ఈ మధ్య కాలంలో చాలా మంది వెయిట్ తగ్గేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరోగ్య నిపుణులు చెప్పి సలహాలు పాటిస్తే వెంటనే తగ్గిపోవచ్చని సూచిస్తున్నారు.

Easy Weight Loss Tips: ప్రజెంట్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ప్రజలను వేధిస్తున్న మహమ్మారి అధిక బరువు. అధిక బరువుతో లేనిపోనీ రోగాలను తెచ్చుకుని జనాలు అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రుల పాలవుతున్నారు. వేలకువేలు డబ్బులు కట్టి ఆస్పత్రుల జేబులు నింపుతున్నారు. ఈమహమ్మారికి రావడానికి ఒకేటే కారణం. అదే మారుతున్న జీవనశైలి. శారీరక శ్రమలేకపోవడం.. నిద్రలేమీ, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో అధిక బరువు భారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోతున్న కొవ్వు ఆందోళన కలిగిస్తోంది.దీంతో బరువు తగ్గించుకోవడానికి మాత్రం ఆపసోపాలు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.
బరువు తగ్గాలంటే సింఫుల్ ట్రిక్ ఫాలో అయితే సరిపోతుందని చెప్తున్నారు వైద్యులు. కఠినమైన డైట్.. గంటల తరబడి వ్యాయామం, జిమ్, జుంబా డ్యాన్స్‌లు ఏమీ అక్కరలేదంటున్నారు. రోజు మనం తినే ఆహారంలో ఆరోగ్యకరమైన కూరగాయలు చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గడానికి మంచి మేలు జరుగుతుందని చెప్తున్నారు. తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ కలిగిన కూరగాయలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. తద్వారా కడుపు నిండిన భావనతో అతిగా తినే అలవాటుతగ్గిపోతుందంటున్నారు.
అయితే బరువు తగ్గాలనుకునే వారికి కొన్ని కూరగాయలను సూచిస్తున్నారు డైటీషీయన్స్. ఆలుగడ్డ తమ డైట్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి కనున.. ఉడికించిన ఆలుగడ్డ కడుపు నిండిన భావనను కలిగించడంలో సహాయపడుతుంది. బరువు నియంత్రణకు కాలీఫ్లవర్ మరో మంచి ఎంపిక. ఇందులో కేలరీలు తక్కువగా ఉండటంతో పాటు ఫైబర్, విటమిన్ సి, ఫోలేట్ వంటి పోషకాలు లభిస్తాయి. కాలీఫ్లవర్ వంటి కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల భోజనంలో కేలరీలను నియంత్రించుకోవచ్చు. మరో మంచి ఔషదం ఆకుకూరలు. వీటిలో విటమిన్ సి, విటమిన్ కె, బీటా కెరోటిన్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడంలో బాగా సహాయపడతాయి. వీటితోపాటు సొరకాయ, బీరకాయ, గుమ్మడికాయ వంటి కూరగాలు కూడా బరువు తగ్గడంలో సహాయం చేస్తాయని తెలుస్తుంది.



