సంపూర్ణ ఆరోగ్యం కావాలా.. అయితే ఇలా చేయండి
కాళ్లకు చెప్పులు లేకుండా పచ్చగడ్డిపై నడవం వల్ల మానసిక ప్రశాంతత కావల్సినంత దొరుకుతుందంటా. ఇది ఆరోగ్య ప్రయోజనాల్లో మొదటి నియమం అని నిపుణులు చెబుతున్నారు. నేరుగా పాదాలు భూమిని తాకడం వల్ల నాడీ వ్యవస్థ శాంతించి, ఒత్తిడిని కలించే హార్మోన్ల స్థాయిలను తగ్గిస్తాయి.

Barefoot Walking : మారుతున్న ఆధునిక జీవనశైలి కారణంగా మనుషులు క్రమంగా ప్రకృతికి దూరమవుతున్నారు. బిజీ లైఫ్ కారణంగా ఉదయం కాని, సాయంత్రం కాని వ్యాయామం లేదా వాకింగ్ చేస్తారు. చాలా కష్టపడ్డామని ఫీల్ అవుతారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే అది ఎలా చేస్తాన్నామనేది పెద్ద ప్రశ్న. సిమెంట్ రోడ్లు లేదా తార్ రోడ్లపై షూస్ వేసుకోవడం లేదా చెప్పులు వేసుకుని నడుస్తాం. అయితే అలాంటి నడకతో సంపూర్ణ ఆరోగ్యం రాదని అధ్యయనాలు చెబుతున్నాయి. చెప్పులు, షూలు వేసుకుని తిరగడం వల్ల శారీరకంగా హెల్త్ సమస్యలు వస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మంచి ఆరోగ్యం పొందాలంటే ప్రకృతి ప్రాసాదించిన పచ్చగడ్డపై చెప్పులు, షూలు లేకుండా నడవడం ఎంతో ఉత్తమమం అని చెబుతున్నారు. దీని ద్వారా సానుకూల ప్రభావం చూపుతుందంటున్నారు. కాసేపు ఒట్టి కాళ్లతో పచ్చగడ్డమీద నడవం వల్ల శరీరానికి, మనసుకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అలా పచ్చిక బయళ్ల మీద నడవడాన్నే గ్రౌండింగ్ లేదా ఎర్తింగ్ అని పిలుస్తారు.
కాళ్లకు చెప్పులు లేకుండా పచ్చగడ్డిపై నడవం వల్ల మానసిక ప్రశాంతత కావల్సినంత దొరుకుతుందంటా. ఇది ఆరోగ్య ప్రయోజనాల్లో మొదటి నియమం అని నిపుణులు చెబుతున్నారు. నేరుగా పాదాలు భూమిని తాకడం వల్ల నాడీ వ్యవస్థ శాంతించి, ఒత్తిడిని కలించే హార్మోన్ల స్థాయిలను తగ్గిస్తాయి. అలాగే పాదాలలో ఉండే నరాల ఉత్తేజపడి శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతోంది. పాదాల కండరాలు, స్నాయువులు బటపడటంతో పాటు శరీర సమతుల్యత కూడా మెరుగుపడుతోంది. కాళ్లు, పాదాల నొప్పుల నుంచి ఉపశమనం తోపాటు రోజంతా ఉత్సాహంగా గడపుతారు. ఇలా చేయడం వల్ల నిద్రలేమీ సమస్య కూడా తగ్గిపోతుంది. నేరుగా పాదాలు భూమిని తాకి నడిచినప్పుడు .. సహజ ఎలక్ట్రాన్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తటస్థపరిచి శరీరంలోని వాపులు తగ్గుతాయి. దీని వల్ల రాత్రి పూట గాఢమైన నిద్ర పడుతోంది. మెదడు రిలాక్స్ అవుతోంది. ఉదయం పూట ఎండలో నడవం వల్ల కూడా పాదాలపై పడే సూర్యరశ్మి ద్వారా శరీరంలోకి మిటమిన్ డి చేరుతుందని వైద్యులు చెబుతున్నారు. షో ఇంకేందుకు ఆలస్యం రేపటి నుంచి మీరు కూడా చెప్పులు, షూలు లేకుండా పార్కుల్లో, అపార్ట్మెంట్ ముందున్న గ్రౌండ్లో అలా అలా ఒక అరగంట పాటు నడవండి. మంచి ఆరోగ్యాన్ని పొందండి. సంపూర్ణ ఆరోగ్యం సొంతం చేసుకోండి.



