యువీ రాక.. మారుతుందా ఢిల్లీ తలరాత
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్.. బెంగాల్ దాదా గంగూలీని హెడ్ కోచ్‌గా నియమించుకుంది. అంతటితో ఆగలేదు.. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు కీలక పోస్టింగ్ ఇచ్చింది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్ జట్టుకు సహాయక కోచ్‌గా.. అలాగే బ్యాటింగ్ కోచ్‌గా ఎంచుకుంది.

Yuvraj Joins Delhi Capitals Coaching Staff
ఎన్నో ఏళ్ల నుంచి ఊరిస్తున్న కలను సాకారం చేసుకునేందుకు ఢిల్లీ టీం గట్టి వ్యూహాలు రచిస్తోంది. ఐపీఎల్లో ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ ఎలాగైన కప్పుకొట్టాలనే కసితో కనిపిస్తుంది. ఈమేరకు ఆజట్టులో జరుగుతున్న పూర్తి స్థాయి ప్రక్షాళన చేస్తే అదే అనిపిస్తుంది. మొదటగా హెడ్ కోచ్‌ను మార్చేసింది. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్.. బెంగాల్ దాదా గంగూలీని హెడ్ కోచ్‌గా నియమించుకుంది. అంతటితో ఆగలేదు.. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు కీలక పోస్టింగ్ ఇచ్చింది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్ జట్టుకు సహాయక కోచ్‌గా.. అలాగే బ్యాటింగ్ కోచ్‌గా(Yuvraj Joins Delhi Capitals Coaching Staff) ఎంచుకుంది. దీనిపై స్పందించిన యువీ కెరీర్లో కొత్త అధ్యాయాన్ని ఆరంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. తనను సహాయ కోచ్‌గా, బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్ యాజమాన్యానికి యువీ ధన్యవాదాలు చెప్పారు. అంతేకాదు తనకు ఆజట్టుతో ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. యాజమాన్యం కూడా బాగా తెలుసన్నారు. ఇది తన కెరీర్‌కు మంచి అవకాశమని చెప్పాడు. యువీ ఢిల్లీ టీం తరపున 2015లో ఆడాడు. అప్పుడు యువీని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 16కోట్లు భారీ మొత్తంలో ఇచ్చి కొనుక్కుంది. అప్పట్లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఆయన నిలిచారు. ఆ సీజన్లో ఢిల్లీ తరఫున మొత్తం 14 మ్యాచ్‌లు ఆడారు యువీ.
ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి మరో డేరింగ్ ఆటగాడు రిషబ్ పంత్ ఎంట్రీ ఇచ్చాడు. వీటన్నింటిని చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఈసారి ఏదైన జరగొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. యువీ కెరీర్‌ను చూస్తే.. 304 వన్డేలు, 40 టెస్టులు, 58 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన యువరాజ్ సింగ్ .. ప్రపంచకప్‌లను గెలిచిన భారత జట్టులో కీలక పాత్ర పోషించారు. యువరాజ్ అనుభవం ఢిల్లీ క్యాపిటల్స్‌కి అధనపు బలమనే చెప్పాలి. ఇటీవల కాలంలో అభిషేక్ శర్మ సైతం తాను యువీ డైరెక్షన్లో రాటుదేలానని చెప్పడం విశేషం. ఎంతో యువీ సూచనలు తీసుకుంటున్నప్పటికీ.. అధికారికంగా కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో యువీ (Yuvraj Joins Delhi Capitals Coaching Staff)ఐపీఎల్ కోచింగ్ ప్రస్థానం ప్రారంభం కానుంది. యువరాజ్ సింగ్ నియామకంతో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ విభాగం మరింత పటిష్ఠం అవుతుందని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. సౌరవ్ గంగూలీతో కలిసి ఆయన పనిచేయనుండటం కూడా ఈ కొత్త నియామకంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.



