WhatsApp New Feature Update: ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్‌లో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్‌ ఉండడం అనేది కామన్‌ పాయింట్. ఆ స్మార్ట్‌ ఫోన్‌లో కూడా ప్రతీ ఒక్కరూ ఉపయోగించే కామన్‌ యాప్‌ వాట్సాప్‌. వాట్సాప్‌ లేని స్మార్ట్‌ ఫోన్‌ను ఊహించుకోవడం చాలా కష్టం. చాలా మంది తమభావాలను, కోపాలను, తాపాలను.. సంతోషాలను, ఇష్టాలను, ఎక్కడ ఉన్నారు.. ఏం చేస్తున్నారు.. అన్నింటిని వాట్సాప్‌ ద్వారా వ్యక్త పరుస్తుంటారు. మరోవైపు సెల్‌ ఫోన్‌ లాక్‌ తీసిన వెంటనే ప్రతీ ఒక్కరూ ఓపెన్ చేసే కామన్‌ యాప్‌ కూడా వాట్సాపే. డీపీలు చూడడం ప్రతి ఒక్కరికి అలవాటుగా మారింది. కొందరైతే వాట్సాప్‌ డీపీలు చూస్తే కాని ఇవాళ ఏ వారమో తెలుసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే తమ ఫ్రెండ్స్ చాలా మంది ఏవారం అయితే ఆవారానికి తగ్గట్లుగా దేవుడి స్టేటస్సులు పెడుతుంటారు కునుక. నడుస్తున్న ట్రెండ్‌కి తగ్గట్లుగా వాట్సాప్ కూడా రోజురోజు కొత్త పుంతలు తొక్కుతోంది. కోట్లాది మంది ఉపయోగిస్తున్న ఈ ప్రముఖ మేనేజింగ్ యాప్‌ తమ వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లుగా ఫీచర్లను రిలీజ్ చేస్తోంది. ఎప్పటికప్పుడు సూపర్ ఫీచర్లను వినియోగదారుల ముందుకు తీసుకోస్తుంది.

ఇప్పుడు వాట్సాప్‌ తమ కస్టమర్లకు మయమరపించేలా మరో సూపర్ ఫీచర్‌కి రెడీ అయింది. ఎంతో కాలంగా వినియోగదారులు కోరుకుంటున్న షెడ్యూల్డ్ మేసేజ్‌లు, ఫోటోలు, వీడియోల ఫీచర్‌ను ప్రజెంట్ ప్రయోగిస్తుంది. దీంతో యూజర్లు తమ టెక్స్ట్ మెసేలు, వీడియోలు లేదా లింక్‌లను ముందుగానే డ్రాఫ్ట్ చేసి .. వాళ్లు ఏరోజైతే పంపించాలని ప్లాన్ చేస్తారో అదే సమయానికి ఆటోమేటిక్‌గా వెళ్లేలా సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ కొత్త ఫూచర్‌ ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో మరింత మందిరికి అందించేలా వాట్సాప్‌ ప్లాన్ చేస్తోంది. రోజువారి చాట్స్‌ను మాత్రమే కాకుండా అడ్వటైజ్‌మెంట్, బర్త్‌డే విషెస్‌, రిమైండర్‌లను పంపవచ్చు. మనం ఏదైనా పనిఉండి మర్చిపోతే మెసేజ్ లు పంపడం సాధ్యం కాదు. ఈ సమస్యల పరిష్కారానికి వాట్సాప్‌ ఈ షెడ్యూలింగ్ ఫీచర్ రెడీ చేసింది. టెలిగ్రామ్ లాంటి యాప్‌లలో ఉన్నప్పటికీ.. వాట్సాప్‌లో లేదు. తాజాగా మెటా ఆధ్వర్యంలో పనిచేసే వాట్సాప్‌ ఈ ఫీచర్ తీసుకురావడం ద్వారా వినియోగదారుల నిరీక్షణకు తెరదించింది.