టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ షురూ.. హ్యాట్రిక్‌పై ఇండియా కన్ను
T20 World Cup 2026 Schedule: ఐసీసీ టోర్నీలో ముందుగా భారత క్రికెట్ అభిమానులు చూసేది.. ఆశించేది ఒకే ఒక్కటి. అదే మన ప్రత్యర్థి.. మన దాయది పాకిస్తాన్ జట్టుతో మ్యాచ్. అయితే ఈటోర్నీలో భారత్, పాకిస్తాన్ జట్లు వేర్వేరు గ్రూపుల్లో పోటీ పడుతున్నాయి

T20 World Cup 2026 Schedule: క్రికెట్ అభిమానులకు గుడ్ చెప్పింది ఐసీసీ. మహిళల అండర్ -19 టీ20 వరల్డ్ కప్ 2027 షెడ్యూల్ రిలీజ్ చేసింది. 2027 జనవరి 21 నుంచి ఫిబ్రవరి 6వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. బంగ్లాదేశ్, నేపాల్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈటోర్నీలో మొత్తం 16 జట్లు 41 మ్యాచ్‌లు ఆడనున్నాయి. టీమ్ ఇండియా మ్యాచ్ ఫిబ్రవరి 22న జరగనుంది. ఐసీసీ టోర్నీలో ముందుగా భారత క్రికెట్ అభిమానులు చూసేది.. ఆశించేది ఒకే ఒక్కటి. అదే మన ప్రత్యర్థి.. మన దాయది పాకిస్తాన్ జట్టుతో మ్యాచ్. అయితే ఈటోర్నీలో భారత్, పాకిస్తాన్ జట్లు వేర్వేరు గ్రూపుల్లో పోటీ పడుతున్నాయి.
మొత్తం 16జట్లు.. నాలుగు గ్రూపులా ఆడుతున్నాయి. గ్రూప్ Aలో ఇండియా, నేపాల్, వెస్టిండీస్, ఐర్లాండ్ జట్టు ఉన్నాయి. గ్రూప్- B లో సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, సామో. గ్రూప్ -cలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నైజిరియా, UAE జట్లు ఉన్నాయి. ఇక గ్రూప్ -D లో ఇంగ్లాండ్, శ్రీలంక, స్కాట్ లాండ్, USA జట్లు ఉన్నాయి. టీమ్ ఇండియా జనవరి 22న వెస్టిండీస్‌తో ఫస్ట్ మ్యాచ్‌లో తలపడుతోంది. 24న నేపాల్, 26న ఐర్లాండ్‌తో ఆడునుంది.
గ్రూప్ దశలో అర్హత సాధించిన జట్లు సూపర్ -6కు చేరుకుంటాయి. అక్కడ నుంచి రెండు గ్రూపుల్లో టాప్-2లో నిలిచిన జట్లు సైమీ ఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి. ఫిబ్రవరి 4న చటోగ్రామ్ వేదికగా సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వే డే కేటాయించారు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతే తర్వాత రోజు తలపడతాయి జట్లు. ఫిబ్రవరి6 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈమ్యాచ్‌కి కూడా సేమ్ రిజర్వ్ డే కేటాయించారు. భారత్ వరుసగా రెండు సార్లు ఛాంపియన్ గా నిలిచింది. గతేడాది ఫిబ్రవరి 2న సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. అంతకుముందు 2023లో ఇంగ్లాండ్‌పై గెలిచింది. ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 7వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈసారి కూడా భారత్ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భారత్ క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. టీమ్ ఇండియా జట్టుకు ఆల్‌ది బెస్ట్ చెబుతున్నారు.



