సంజూ ఇంకెప్పుడు.. పుజారా వ్యాఖ్యలు..
Pujara on Sanju Samson: డోర్లో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సంజూ ప్రదర్శనపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ పుజారా స్పందించారు. తక్కుల పరుగులకే సంజూ అవుట్ కావడం వెనుక ఉన్న కారణాలు.. ఆయన వర్షన్‌లో చెప్పారు.

Pujara on Sanju Samson: ఆసియా క్రిడల్లోనే కాదు.. సొంత గడ్డపై. వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్ లోను టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ గాడిన పడలేదు. సొంత గడ్డపై జరుగుతున్న టీ20సిరీస్‌లో టీమిండియా ఆటగాళ్లందరూ రాణిస్తున్నా సంజూ మాత్రం ఇంకా తడబడుతూనే ఉన్నాడు. సిరీస్‌లో తన మార్కు బ్యాటింగ్ చూపించలేక ఆపసోపాలు పడుతున్నాడు. ఈసిరీస్‌లోనే కాదు.. ఆసియా క్రిడల్లో సంజూపై ఆశలు పెట్టుకున్న టీమ్ ఇండియా జట్టుకు తీవ్ర నిరాశే ఎదురైంది. సెమీఫైనల్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో తొమ్మిది బంతుల్లో 7 పరుగులు, ఫైనల్‌లో పాకిస్తాన్‌పై నాలుగు బంతుల్లో 2పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. సరే కదాని సొంతగడ్డపై జరిగే సీరిస్‌లోనైనా పుంజుకుంటాడని అవకాశం ఇస్తే ఇక్కడ లయతప్పుడుతున్నాడు. కరేబియన్ జట్టుపై ఆడిన తొలి మూడు టీ20ల్లో ఫస్ట్ మ్యాచ్ 11, రెండో మ్యాచ్ 82, మూడో మ్యాచ్ 2 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఫామ్ లో ఉన్న వైభవ్ సూర్యవంశీని సైతం పక్కన పెట్టి అవకాశం కల్పిస్తే వినియోగించుకోవడం లేదని ఆరోపణలు సంజూపై వస్తున్నాయి.
ఇదేక్రమంలో ఇండోర్‌లో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సంజూ ప్రదర్శనపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ పుజారా స్పందించారు. తక్కుల పరుగులకే సంజూ అవుట్ కావడం వెనుక ఉన్న కారణాలు.. ఆయన వర్షన్‌లో చెప్పారు. పిచ్‌ని అర్థం చేసుకోవాడానికి సంజూ ఇంకొంత సమయం తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. అటు అభిషేక్ శర్మ క్రీజులో కుదురుకోవడానికి టైం తీసుకోవడంతో శాంసన్‌పై ఆఒత్తిడి పడిందన్నారు. దీంతో వేగంగా పరుగులు చేసేందుకు ప్రయత్నించి సంజూ అవుటయ్యాడని పుజారా సపోర్ట్‌గా మాట్లాడారు. మరోవైపు ఇషాన్ కిషన్‌పై పుజారా ప్రశంసలు కురిపించాడు. టాప్ ఆర్డర్‌లో దూకుడుగా ఆడుతూ .. సహచర బ్యాటర్లకు సహకరిస్తూ పవర్ ప్లేలో వీలైనన్ని మంచి పరుగులు చేస్తున్నారడని.. టీమ్ ఇండియా గెలుపులో భాగస్వామి అవుతున్నాడని పొగిడాడు. ప్రతీ మ్యాచ్లో భారీ స్కోర్ చేయనవసరం లేదని .. జట్టు అవసరాలకు తగ్గట్టుగా 30 నుంచి 40 పరుగులు చేస్తే సరిపోతుందని పుజారా అభిప్రాయపడ్డాడు.



