Narendra Modi: కఫాల్ పండు.. పేరు వినడానికి కొత్తగా ప్రధాని మోదీ మెచ్చిన ఫ్రూట్ ఇది. కానీ హిమాలయ ప్రాంతాల్లో లభించే ఈ అరుదైన పండు ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి (Modi) కూడా కఫాల్ పండు అంటే ఎంతో ఇష్టమని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. చిన్నగా, గుండ్రంగా, ఎరుపు రంగులో కనిపించే ఈ పండు తియ్యటి, పుల్లటి రుచితో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కఫాల్ పండు ప్రధానంగా భారతదేశంలోని ఉత్తరాఖండ్‌తో పాటు హిమాలయ ప్రాంతాల్లో, నేపాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో పెరుగుతుంది. సముద్ర మట్టానికి సుమారు 1,500 నుంచి 2,000 మీటర్ల ఎత్తులో ఉండే ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది. వాతావరణ పరిస్థితులను బట్టి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఈ పండు అందుబాటులో ఉంటుంది. సీజనల్‌గా మాత్రమే లభించడంతో ఈ పండుకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

అందుకే మోదీ రోజు తింటారు

ఈ పండులో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉండవచ్చు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడతాయి. విటమిన్ సి చర్మ ఆరోగ్యానికి, కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఫైబర్ జీర్ణక్రియ సక్రమంగా సాగేందుకు ఉపయోగపడుతుంది. అలాగే కఫాల్ పండు తింటే జుట్టు రాలడం ఆగిపోతుందని, చెవినొప్పి, పంటినొప్పి, ఆస్తమా, జ్వరం, అల్సర్లు లేదా రక్తహీనత నయమవుతాయనే ప్రచారంలో ఉంది. ప్రధాని నరేంద్ర మోదీకి కఫాల్ పండు ఇష్టమనే ప్రచారం ఈ పండుపై ఆసక్తిని మరింత పెంచుతోంది. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక ఫ్రూట్‌ని తీసుకుంటారు ప్రధాని మోదీ. మొత్తానికి, ప్రత్యేకమైన రుచి, కాలానుగుణ లభ్యత, పోషక విలువల కారణంగా కఫాల్ పండు ఆసక్తికరమైన హిమాలయ పండుగా గుర్తింపు పొందింది. అందుకేనేమో ప్రధాని మోదీ ఈవయసులో కూడా ఎంతో హుషారుగా, గ్లామర్‌గా కనిపిస్తారు. రోజు సమావేశాలు నిర్వహించడంతో పాటు బహిరంగ సభల్లో  పాల్గొన్నప్పుడు ఎనర్జిటిక్‌గా కనిపిస్తారు..