కివీస్ టూర్‌కి జట్టు ప్రకటన.. వన్డేలలో బుమ్రాకు రెస్ట్
Jasprit Bumrah Rested for ODI Match: తొలి మూడు వన్డేలకు గిల్ కెప్టెన్ గా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్షదీప్ సింగ్, ఇషాన్ కిషన్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ ను ప్రకటించారు

Jasprit Bumrah Rested for ODI Match: రేపు టీ20 మ్యాచ్ ముగిసిన వెంటనే టీమ్ ఇండియా న్యూజిలాండ్ టూర్ కి వెళ్లనుంది. అక్కడ ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్ట్‌లు టీమ్ ఇండియా ఆడనుంది . దీని కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ టీంను ప్రకటించింది. గిల్ కెప్టెన్సీలో మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అలాగే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో రెండు వన్డేలు, టీ20 సిరీస్ భారత్ జట్టు ఆడనుంది. అక్టోబర్ 22 నుంచి టీ20 మ్యాచ్‌లు జరగనుండగా.. నవంబర్ 4 నుంచి వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. నవంబర్ 19 ఫస్ట్ టెస్ట్… 27న రెండో టెస్ట్ జరగనుంది.
తొలి మూడు వన్డేలకు గిల్ కెప్టెన్ గా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్షదీప్ సింగ్, ఇషాన్ కిషన్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ ను ప్రకటించారు. ఇక నాలుగు, ఐదు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా.. రోహిత్, కోహ్లీ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన్ ధీర్, అఖీబ్ నబీ, గర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్ , అర్షదీప్ సింగ్, కుమార్ కుశగ్రా, మహ్మద్ సిరాజ్, యశ్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ ను ప్రకటించారు .
టెస్ట్ మ్యాచ్ ల కోసం గిల్ కెప్టెన్, యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవ్‌దత్ పడిక్కల్, రిషబ్ పంత్, ధ్రువ్ జెరెల్, రవీంద్ర జడేజా, అన్షుల్ కాంబోజ్, జస్మ్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ కు చోటు కల్పించారు.



