తెలుగోడి దెబ్బా.. కివీస్ అబ్బా..
India vs New Zealand 2nd T20: రెండో టీ20లో కివీస్‌కు చుక్కులు చూపించారు మన తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితిశ్‌కుమార్ రెడ్డి. కష్టకాలంలో భారత్ తరపున అద్భుత ఇన్నింగ్ ఆడి.. టీమ్ ఇండియా గెలుపునకు కృషి చేశారు. చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించారు.

India vs New Zealand 2nd T20:
స్వదేశంలోనే కాదు.. కివీస్ గడ్డపైనా టీమ్ ఇండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. శనివారం జరిగిన రెండో టీ20లోను భారత్ ఘన విజయం సాధించింది. కష్టమైన పిచ్‌లో కూడా భారత్ ఒక బాల్ మిగిలుండగానే కివీస్ టార్గెట్‌ను పూర్తి చేసింది. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో 5టీ20ల సిరీస్‌లో 2-0తో ముందంజలో ఉంది. న్యూజిలాండ్ జట్టుకు సొంతగడ్డపై వరుసగా రెండో ఓటమిని రుచి చూపించారు టీమ్ ఇండియా కుర్రాళ్లు. అయితే ఈగెలుపు క్రెడిట్ మాత్రం మన తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీశ్‌కుమార్‌రెడ్డికే ఇవ్వాలి. ఓటమి తప్పదనుకున్న సమయంలో అద్భుత ఇన్నింగ్‌తో అదరగొట్టారు. చివరి మూడు ఓవర్లలో మెరుపు బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఇండియా వైపు టర్న్ చేశారు. భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
ఫిలిప్స్ ఆఫ్ సెంచరీ వృధా! (Glenn Phillips )
క్రైస్ట్‌చర్చ్ వేదికగా శనివారం రెండో టీ20 మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 20ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 180పరుగులు చేసింది. మ్యాచ్ ఆరంభంలో భారత్ బౌలర్లు రెచ్చిపోయినా.. తర్వాత కివీస్ బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. టీమ్ సీఫెర్ట్ 7, డారిల్ మిచెల్ 6, ఫిన్ అలెన్ 16 వెంటవెంటనే ఔట్ అయ్యారు. ప్రిన్స్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, నితీష్‌కుమార్ రెడ్డి తలో వికెట్ తీసుకోగా.. అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్ భారత్ బౌలర్లపై రెచ్చిపోయారు. ఫిలిప్ 43 బాల్స్‌లో 70రన్స్ చేశాడు. జాకబ్స్ 46 బంతుల్లో 58 పరుగులు చేశాడు. వీరిద్దరిది ఫోర్త్ వికెట్‌కు 116 రన్స్ పార్‌నర్‌షిప్. లాస్ట్‌లో బ్రేస్‌వెల్ రెండు బంతుల్లో 10పరుగులు చేయడంతో కివీస్ 180 పరుగులు సాధించింది.
తెలుగోడి సత్తా..
181 రన్స్ టార్గెట్‌తో క్రీజ్ లోకి దిగిన టీమ్‌ఇండియాకు స్టార్టింగ్ లోనే ఎదురుదెబ్బ తగింది. గత మ్యాచ్‌లో 60 పరుగులతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్ .. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ ఓవర్‌లోనే తడబడ్డాడు. ఫస్ట్ ఓవర్ మేడిన్ చేశాడు. తర్వాత 14 పరుగులకే ఔట్ అయ్యాడు. ఇక యువ బ్యాటర్ వైభవ్ కూడా 4 రన్స్‌కే ఫెవిలియన్‌కు చేరుకున్నాడు. అభిషేక్ శర్మ 27, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 7 , అక్షర్ పటేల్ 11పరుగులు మాత్రమేచేశారు. ఎక్కువ సేపు ఆడలేకపోయారు. దీంతో వరుస వికెట్లు పడి.. టార్గెట్ పెరిగి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అదే సమయంలో క్రీజ్‌లోకి అడుగుపెట్టిన వైస్ కెప్టెన్ తిలక్ వర్మ సూపర్ ఇన్నింగ్ ఆడాడు. నమన్ ధీర్, నితీశ్ కుమార్‌తో కలిసి టీమ్‌ఇండియా గెలుపునకు కృషి చేశాడు. తనదైన శైలిలో బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. తిలక్ వర్మ(Tilak Varma )కు జోడిగా నితీశ్, నమన్ ధీర్ దూకుడుగా ఆడారు. నమన్ ధీర్ 17బంతుల్లో 31 రన్స్ చేసి చివర్లో ఔట్ అయ్యాడు. చివర్లో నితీశ్‌తో కలిసి తిలక్ మ్యాచ్‌ని ఫినీష్ చేశాడు. తిలక్ వర్మ 51 నాటౌట్, నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) 26 నాటౌట్ గా నిలిచారు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. తిలక్, నితిశ్‌ల మెరుపు ఇన్నింగ్ స్వదేశంలో వెస్టీండిస్‌తో హైదరాబాద్‌లో జరిగిన నాల్గవ 20 మ్యాచ్‌లో కుదురుతుంది అనుకున్నారు. ఆరోజు వీరిద్దరి ఆట చూస్తే మన తెలుగోళ్లే మ్యాచ్ ఫినిష్ చేస్తారనే ఆశలు అభిమానులకు రేకెత్తించారు. కాని తిలక్ ఔట్ కావడంతో ఆరోజు కుదరలేదు. ఈరోజు తెలుగు కుర్రాళ్లు కివీస్ గడ్డపై ఫినిషర్లుగా నిలిచారు. రికార్డు విజయం సాధించారు. మన తెలుగోడి సత్తా నిరూపించారు. అవకాశాలు ఇస్తే నిరూపించుకుంటారని తేల్చిచెప్పారు.



