ఉప్పల్‌లో హోరు.. మ్యాచ్‌కి వచ్చేవారికి రూల్స్ షురూ
చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో క్రికెట్ ఫీవర్ నెలకుంది. రేపు ఉప్పల్ స్టేడియంలో ఇండియా, వెస్టిండీస్ మధ్య నాల్గవ టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్ల సభ్యులు హైదరాబాద్‌కు చేరుకున్నారు.

India V West Indies T20 Uppal Stadium Match
చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో క్రికెట్ ఫీవర్ నెలకుంది. రేపు ఉప్పల్ స్టేడియంలో ఇండియా, వెస్టిండీస్ మధ్య నాల్గవ టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్ల సభ్యులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఇవాళ ప్రాక్టీస్ కూడా చేశారు. రేపు సాయంత్రం 7గంటల నుంచి ఉప్పల్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే 5మ్యాచ్‌ల సీరిస్‌లో భారత్ 2-1తో ముందంజలో ఉంది. రేపు ఉప్పల్‌లో జరిగే మ్యాచ్‌లో గెలిచి సిరీస్ గెలవాలని భావిస్తోంది టీమ్ ఇండియా. ఇందుకోసం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మరోవైపు వెస్టిండీస్ టీం ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయింది. రేపటి మ్యాచ్‌లో కూడా ఓడితే టీ20 సీరిస్ కూడా చేజారుతోంది. దీంతో రేపటి మ్యాచ్‌పై భారీ ఆశలు పెట్టుకుంది వెస్టిండీస్. ఉప్పల్ స్టేడియంలో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో నిలవాలని చూస్తోంది. దీంతో రేపటి మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది.
ఉప్పల్ స్టేడియంలో భారత్ జట్టులోని సభ్యులకు గట్టిపట్టుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డికి ఇక్కడ గట్టి పట్టుంది(India V West Indies T20 Uppal Stadium Match). జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల్లో సెంచరీలతో చెలరేగారు. అదేగాని జరిగితే రేపు ఉప్పల్‌లో పరుగులు వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు ఇండియా గెలిచే అవకాశాలే కనిపిస్తున్నాయి. అలాగే రేపటి మ్యాచ్‌లో టాస్ కూడా కీలకం కానుంది. టాస్ గెలిచిన టీం మొదట బ్యాటింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ వాతావరణాన్ని దృష్టిపెట్టుకుని టాస్ గెలిచిన జట్టు బ్యాంటింగ్‌కు మొగ్గుచూపొచ్చని క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు.
ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌కి సిటీ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. స్టేడియం పరిధిలో 10వేల మంది పోలీసులతో సెక్యూరిటీ టైట్ చేశారు. ఇప్పటికే మ్యాచ్‌కి (India V West Indies T20 Uppal Stadium Match)సంబంధించిన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. గంటల వ్యవధిలోనే అమ్ముడుపోయాయని చెప్పారు. దీంతో కేవలం టికెట్ ఉన్నవారు మాత్రమే స్టేడియం దగ్గరకు రావాలని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు. అలాగే బ్లాక్‌లో టికెట్లు కొని మోసపోవద్దని.. పోలీసులకు సహకరించాలని తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ సందర్భంగా మెట్రో సేవలను పొడించారు అధికారులు. రాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అంతేకాదు మ్యాచ్ చూసేందుకు వచ్చే అభిమానులు మెట్రో సేవలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఏదైనా ఇబ్బందులు కలిగితే వెంటనే అక్కడే ఉండే పోలీసులకు తెలియజేయాలని చెప్పారు.



