భారత్‌కు ఎదురుందా..! రెండో వన్డేలోను గెలుపు
కివీస్ గడ్డపై భారత్ విజయపరంపర కొనసాగుతోంది. ఇప్పటికే తొలి వన్డేలో అద్భుత విజయం సాధించిన టీమ్ ఇండియా..రెండో వన్డేలోను విక్టరీ సాధించింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ గెలుపొందింది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా 4 పరుగుల తేడాతో గెలిచింది.

India Beat New Zealand
కివీస్ గడ్డపై భారత్ విజయపరంపర కొనసాగుతోంది. ఇప్పటికే తొలి వన్డేలో అద్భుత విజయం సాధించిన టీమ్ ఇండియా..రెండో వన్డేలోను విక్టరీ సాధించింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ గెలుపొందింది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా 4 పరుగుల తేడాతో(India Beat New Zealand ) గెలిచింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 2-0తో ఆధిక్యం సాధించింది. ఈమ్యాచ్‌లోను భారత్ యువ బౌలర్లు రెచ్చిపోయారు. సొంత గడ్డపై కివీస్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. టాస్ గెలిచిన గిల్ సేన0 ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను భారత పేసర్లు ఆరంభంలోనే దెబ్బకొట్టారు. అఖిబ్ నబీ రెండు వికెట్లు తీసి కివీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అన్షుల్ కాంబోజ్ కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా డారిల్ మిచెల్ మాత్రం పట్టుదలగా ఆడాడు. 104 బంతుల్లో 55 పరుగులు చేశాడు. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 31 పరుగులతో రాణించాడు. చివరకు 41 ఓవర్లలో కివీస్ 134 పరుగులకు ఆలౌటైంది. గుర్నూర్ బ్రార్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. అఖిబ్ నబీ, అన్షుల్ కాంబోజ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు.
బ్రార్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్
134 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గోల్డెన్ డక్ అయ్యాడు. విరాట్ కోహ్లీ సైతం 7 పరుగులకే ఔటయ్యాడు. రోహిత్ శర్మ 23, శ్రేయస్ అయ్యర్ 30 పరుగులు చేసి ఆదుకునే ప్రయత్నం చేశారు. కేఎల్ రాహుల్ 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 26 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసిన సమయంలో వర్షం మొదలైంది. ఎంతసేపటికీ తిరిగి మ్యాచ్ ప్రారంభం కాకపోవడంతో రద్దు చేశారు. డీఎల్‌ఎస్ లెక్కల ప్రకారం భారత్ 4 పరుగుల తేడాతో విజేతగా(India Beat New Zealand ) నిలిచింది. రెండో వన్డేలో భారత యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ వరించింది. ఈమ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 30 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ గడ్డపై ఒక భారత ఫాస్ట్ బౌలర్ నమోదు చేసిన రెండో అత్యుత్తమ గణాంకాలు ఇవి. 2003లో ఆక్లాండ్‌లో జవగళ్ శ్రీనాధ్ 23 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. శ్రీనాధ్ తర్వాత ఈఫీట్ సాధించిన రెండో బౌలర్‌గా రికార్డుకెక్కాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు గుర్నూర్ 7 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు.
కోహ్లీ రికార్డు
టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వెల్లింగ్టన్‌లోని సెల్లో బేసిన్ రిజర్వ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డే(India Beat New Zealand )లో, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను అధిగమించాడు. కివీస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 7 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.
ఈ మ్యాచ్ కి ముందు కోహ్లీ, పాంటింగ్ ఇద్దరూ న్యూజిలాండ్‌పై 1,971 పరుగులతో సమంగా ఉన్నారు. రెండో బంతికే బౌండరీ బాదిన కోహ్లీ, పాంటింగ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ ఈ మైలురాయిని 51 మ్యాచ్‌ల్లోని 50 ఇన్నింగ్స్‌లలో చేరుకోగా, విరాట్ కోహ్లీ కేవలం 38 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధించడం విశేషం. ప్రస్తుతం కోహ్లీ 1,978 పరుగులతో ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ సిరీస్‌లో ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో న్యూజిలాండ్‌పై 2,000 వన్డే పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా నిలిచే సువర్ణావకాశం కోహ్లీ ముందుంది. కివీస్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ, పాంటింగ్ తర్వాత సచిన్ టెండూల్కర్ (1,750), కుమార్ సంగక్కర (1,568), సనత్ జయసూర్య (1,519) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Nothing is more beautiful than cover drive of Virat Kohli 🎀🤍🫶
What a shot mannn 🔥 https://t.co/EU1V0CP502
— GOATED EDITS (@alivethoughdead) November 7, 2026



