Cricket Match Free Passes: ఇండియాలో క్రికెట్‌కు ఉండే క్రేజ్‌ వేరు. క్రికెట్‌ను ఇక్కడి ప్రజలు అత్యంత ఎక్కువగా ఆరాదిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని సంస్థలు స్పెషల్ ఆఫర్లు సైతం ప్రకటిస్తాయి. అయితే ఈసారి సంస్థలు కాదు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే అభిమానులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. బింబాబ్వేతో జరిగే టీ20 సిరీస్‌కు ఫ్రీ ఎంట్రీ కల్పిస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ వేదికగా జింబాబ్వే- ఇండియా మహిళా జట్ల మధ్య శుక్రవారం రాత్రి ఫస్ట్ టీ20 మ్యాచ్‌ జరుగుతుంది. ఈమ్యాచ్‌ చూడడానికి వచ్చే మహిళా అభిమానులకు ఉచిత ప్రవేశం కల్పించారు. ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సూచనల మేరకు ఆరాష్ట్ర క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

మ్యాచ్‌కి వచ్చే మహిళలకు ఫ్రీ ఎంట్రీ పాస్‌ ఇచ్చింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఫస్ట్ మ్యాచ్ .. రెండో టీ20 అక్టోబర్ 18న, మూడో టీ20 ఈనెల 20న జరగనుంది. రాత్రి 7గంటలకు మ్యాచ్‌ ప్రారంభమవుతాయి. భారత మహిళా జట్టు కెప్టెన్‌గా హర్మన్‌ ప్రీత్ తప్పుకోవడంతో ఆమె స్థానంలో దాదాపు దశాబ్దం తర్వాత స్మృతి మంధాన బాధ్యతలు వహిస్తున్నారు. ఆమె కెప్టెన్సీలో ఛత్తీస్‌గఢ్ వేదికగా మొదటి మ్యాచ్‌ జరుగుతుంది.