Bumrah New Zealand Series: న్యూజిలాండ్ సిరీస్‌కు టీమ్‌ ఇండియా రెడీ అవుతోంది. శనివారం వెస్టిండీస్‌తో చివరి టీ20మ్యాచ్‌ ముగియగానే కివీస్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడనుంది. ఇప్పటికే టీ20 సిరీస్ కోసం స్క్వాడ్‌ను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీకి పంపింది. రెండు, మూడురోజుల్లో వన్డే సిరీస్‌ కోసం జట్టు ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈటైంలో వన్డే జట్టులో జస్‌ప్రీత్ బుమ్రాకు ప్లేస్ ఇస్తారా? లేదా అనే కొత్త వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కివీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు బుమ్రాకు రెస్ట్ ఇస్తారనే టాక్‌ గట్టిగానే వినిపిస్తుంది. గాయం కారణం కాదని.. టెస్ట్‌ సిరీస్‌ కోసమే ఈ నిర్ణయం తీసుకోబోతున్నారని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్‌.. అలాగే వచ్చే ఏడాది జరిగే బోర్డర్- గవాస్కర్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకుని వీలైనంత వరకు టెస్టుల్లోనే బుమ్రాకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని బీసీసీఐ వర్గాలు చెప్పాయి. పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉన్న బుమ్రాను.. సుదీర్ఘమైన కివీస్‌ టూర్‌లో జరిగే ఏ సీరిస్‌లో ఆడించాలనేది పరిశీలిస్తామన్నారు. వన్డేలు ఆడిన వెంటనే టెస్ట్ క్రికెట్‌పై ఫోకస్ చేయడం చాలా కష్టం కనుక.. బుమ్రా విషయంలో మేనేజ్‌మెంట్ ఆలోచిస్తుందని తెలిపారు.

డబ్యూటీసీలో ఫైనల్‌కు వెళ్లాలంటే భారత్‌కు పెద్ద సవాల్‌ ఎదురవుతోంది. ఇప్పడు ఆడబోయే ప్రతీ మ్యాచ్‌ టీమ్‌ ఇండియాకు కీలకం. ఇప్పడు భారత్‌ ముందు కఠిన సవాల్ ఇదే. కివీస్‌ సొంత గడ్డపై జరిగే మ్యాచ్‌లలో ఆజట్టును ఎదుర్కోవడం ఏజట్టుకైనా కష్టమే. అలాంటి కఠినమైన సవాల్‌ను భారత్ ఎలా స్వీకరిస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. కివీస్‌ను స్వంత గడ్డపై టెస్టుల్లో ఓడిస్తే ..టీమ్‌ ఇండియా డబ్యూటీసీ టుబుల్‌లో ముందుకు దూసుకొస్తుంది. ప్రజెంట్ భారత్ 51.52 శాతంతో ఐదో ప్లేస్‌లో ఉంది. ఆస్ట్రేలియా 80శాతంతో ఫస్ట్ ప్లేస్‌.. 75 శాతంతో సౌత్ ఆఫ్రికా రెండో ప్లేస్.. 72.22 న్యూజిలాండ్ మూడో స్థానంలో.. 55.56 శాతంతో బంగ్లాదేశ్‌ మనకంటే ముందున్నాయి. ఇప్పుడు కివీస్‌తో జరగబోయే రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల్లో గెలిస్తే టీమ్‌ ఇండియా మూడో ప్లేస్‌ కు వస్తుంది. అదే ఒక్క మ్యాచ్‌ ఓడినా ఫైనల్ రేస్‌ నుంచి తప్పుకుంటుంది. ఇలాంటి సమయంలో టెస్ట్ సిరీస్‌పై భారత్ దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే బుమ్రాకు టీ20, వన్డే సిరీస్‌లో రెస్ట్ ఇచ్చి..టెస్టుల్లో ఆడించాలనేది మేనేజ్‌మెంట్ నిర్ణయం. ఇదే ప్లాన్ అమలు చేస్తారా.. లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటారా చూడాలి మరి.