Amit Mishra: టీమ్‌ ఇండియా మాజీ లెగ్ స్పిన్నర్ అమిత్‌ మిశ్రా.. విరాట్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓపాడ్‌కాస్ట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో కోహ్లీ, కుంబ్లే గురించి కీలక విషయాలు చెప్పాడు. తాను జట్టులోకి తిరిగి రాకపోవడానికి గల కారణాలను పాడ్‌కాస్ట్‌లో వెల్లడించాడు మిశ్రా. 2017లో బెంగళూరులో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో తాను గాయపడ్డానన్నారు. ఆగాయం తన జీవితాన్నే మార్చేసిందన్నారు. తన అంతర్జాతీయ కెరీర్‌పై ప్రభావం చూపిందన్నారు. అదే భారత్‌ తరపున తనకు లాస్ట్‌ మ్యాచ్ అయిందన్నారు. అయితే గాయం కాగానే అప్పటి కోచ్ అనిల్‌ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీ తనతో మాట్లాడారని తనలో భరోసా నింపారన్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోగానే తిరిగి జట్టులోకి తిరిగి తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. కానీ వారి హామీలు ఆచరణలోకి రాలేదన్నారు.

ఫోన్‌ చేశా.. మెసేజ్‌ పెట్టా రిప్లై లేదు..(Amit Mishra)
తాను పూర్తిగా గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్ సాధించానని చెప్పాడు మిశ్రా. గాయం నుంచి కోలుకున్నాక కోహ్లీని కలిసి పరిస్థితి ఏంటని అడిగాన్నారు. వారం నుంచి పది రోజుల్లో సమచారం ఇస్తానని కోహ్లీ తనకు చెప్పాడన్నారు. వారం, రెండు వారాలు, మూడు వారాలు గడిచినా కోహ్లీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నాడు. ఇక వెయిట్ చేయలేక తానే ఫోన్ చేశానని చెప్పాడు మిశ్రా. అప్పడే నాకు కోహ్లీ ట్విస్ట్ ఇచ్చాడన్నాడు మిశ్రా. ఫోన్ ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్‌చేయలేదని.. మెసేజ్ చేసినా రిప్లై లేదన్నాడు. చివరకు తనకే విసుగొచ్చి వదిలేశానన్నాడు. మన తలరాత ఇలా ఉంటే ఎవరేమి చేయగలని అమిత్ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తనకు ఒక్కటే బాధ అన్నారు. తనకంటే తీవ్రంగా గాయపడిన వారు.. ఎక్కువ కాలం క్రికెట్‌కు దూరంగా ఉన్న కొందరు ప్లేయర్లు మాత్రం ఫిట్‌నెస్ సాధించగానే తిరిగి జట్టులోకి వచ్చారని చెప్పారు అమిత్‌ మిశ్రా. తన విషయంలో మాత్రం అలా జరగలేదని.. ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్‌ లేదన్నాడు.

అమిత్‌ మిశ్రా రికార్డులు..(Amit Mishra)
ఈమాజీ లెగ్‌ స్పిన్నర్ అమిత్‌ మిశ్రా మొత్తం 22టెస్టులు, 36వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు భారత్‌ తరపున ఆడారు. 2003లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేల్లో .. 2008లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో టెస్ట్‌ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2013లో జింబాబ్వేపై వన్డేల్లో ఆరు వికెట్లు తీసి 48 పరుగులు ఇచ్చి అద్భుత ప్రదర్శన చేశాడు. ఇక ఐపీఎల్‌లో 162 మ్యాచ్‌లు ఆడాడు. 174 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌చరిత్రలో మూడు హ్యాట్రిక్‌లు సాధించిన ఏకైక బౌలర్‌గా రికార్డు తన స్వంతం. 2025 సెప్టెంబర్ 4న అమిత్‌ మిశ్రా అన్ని ఫార్మెట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ఎన్నికయ్యాడు.