HomeDevotionalఈ గణపతి చాలా కాస్ల్టీ.. ఎంతో తెలుసా?

ఈ గణపతి చాలా కాస్ల్టీ.. ఎంతో తెలుసా?

Published on

దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. కొంతమంది గణపతులు నిమజ్జనానికి తరలుతున్నారు. గుజరాత్‌లోని సూరత్‌లో వజ్రాల వ్యాపారి కనుభాయ్‌ అసోదరియా ఏటా వజ్ర గణపతికి పూజలు చేస్తారు. ఈసారి కూడా గణపతిని భారీగా తయారుచేశారు. 182.3 క్యారెట్లతో 36.5 గ్రాముల బరువు ఉన్న ఈ వజ్ర గణపతిని ఏడాదికి ఒక్కరోజు మాత్రమే బయటకు తీస్తారు. ఆ రోజున ప్రత్యేక దర్శనానికి భక్తులను కూడా అనుమతించడం జరుగుతుంది. ఇది కోహినూర్‌ వజ్రం కంటే చాలా పెద్దదని చెబుతున్నారు. ఈ వజ్రం ధర గురించి ఆరాతీస్తే కళ్ళు తిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. మార్కెట్లో ఈ గణపతి ధర రూ.600 కోట్లు ఉంటుందని అంటున్నారు. పదిహేనేళ్ల క్రితం వ్యాపార నిమిత్తం బెల్జియంలో పర్యటించిన కనుభాయ్‌ అక్కడి నుంచి ముడి వజ్రాలను భారత్‌కు తీసుకు వచ్చి వాటిని పాలిష్ చేయించారు. అందులోని ఒక వజ్రం గణపతి ఆకారంలో ఉన్నట్లు మా తండ్రికి కల వచ్చింది. పరిశీలిస్తే.. ఒక వజ్రం ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన వినాయకుడి ఆకారంలో ఉంది. అప్పటి నుంచి ఈ వజ్ర గణపతికి మా కుటుంబం పూజలు చేస్తోంది అని వెల్లడించారు కనుభాయ్‌. ఈ వజ్రగణపతికి పూజలు చేస్తే సంపద పెరుగుతుందని, అన్నీ శుభాలు కలుగుతాయన్నారు. ఈ వజ్రగణపతి దగ్గర మాత్రం సెక్యూరిటీ భారీగా ఉంది.

Latest articles

More like this