HomeDevotionalగోమాతకు స్వయంవరం ….ఎక్కడో తెలుసా?

గోమాతకు స్వయంవరం ….ఎక్కడో తెలుసా?

Published on

గతంలో మహారాజులు తమ యువరాణులకు స్వయం వరం ప్రకటించి.. నచ్చిన వరుడిని ఎంపికచేసుకునే అవకాశం కల్పించేవారు. తాజాగా కాకినాడలో ఇలాంటి అరుదైన స్వయంవరం ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాకినాడ రూరల్ రమణయ్యపేటలో ఏపీఎస్పీ ఎదురుగా తిరుమల ఆస్పత్రి వైద్యుడు గౌరీశేఖర్, రమాదేవి దంపతులు ఓ గోమాతను తమ బిడ్డలా చూసుకుంటున్నారు. వృత్తి పరంగా వైద్యులైన ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నా వారి కంటే ఎక్కువ ప్రేమను ఈ గోవుపై చూపుతారు. సరిగ్గా 20 నెలల క్రితం 2022, జనవరి 22న గోవుకు ఘనంగా బారసాల, ఊయల వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించి ‘సారణ’గా పేరు పెట్టారు. అప్పట్లో ఈ తతంగం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇప్పుడు 21వ మాసంలోకి అడుగు పెట్టిన ‘సారణ’కు వివాహ వయసు రావడంతో వైద్య దంపతులు స్వయంవరం ప్రకటించారు. ఆదివారం ఈ కార్యక్రమం జరగనుంది. వివిధ ప్రాంతాల్లోని నందీశ్వరులకు ఆహ్వానం పంపారు.12మంది నందీశ్వరులు హాజరవుతున్నారు. ఏపీఎస్పీ ఫంక్షన్ హాలు వద్ద ఖాళీ స్థలంలో సుమారు 12 మంది నందీశ్వరులను వరుసలో ఉంచితే, వరమాలతో ‘సారణ’ తనకు నచ్చిన నందీశ్వరుడిని ఎంపిక చేసుకోనుంది. ఈ కార్యక్రమానికి వైద్య దంపతులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఫంక్షన్ హాలు సమీపంలో ‘సారణ’ వరమాలతో నందీశ్వున్ని ఎంపిక చేసుకున్న అనంతరం వివాహ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం కంచి, తిరుపతి, తిరువణ్ణామలై నుంచి వేద పండితులు వస్తున్నారని, శాస్త్రోక్తంగా కల్యాణం జరుపుతారని గౌరీశేఖర్ తెలిపారు.జంతువులతో ముఖ్యంగా గోవులతో మనుషులకు ఎంతటి అనుబంధమో ఈ ఘటన తెలియజేస్తుందంటూ స్థానికులు పేర్కొంటున్నారు. గోవును దైవంగా, తమ బిడ్డగా భావించి ఇలా వేడుకలు జరపడంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఈ దంపతులను అభినందిస్తున్నారు. స్వయం వరం అనంతరం కళ్యాణం నిర్వహిస్తున్నారు. తిరుపతి, కంచి, తిరువణ్ణామలై నుండి వస్తున్న వేదపడింతులచే శాస్త్రోక్తంగా గోమాత నందీశ్వరుల వివాహ వేడుక జరగనుంది. అంతేకాదు వివాహం అనంతరం గోఆధారిత పదార్దాలతో వండిన ఆహారంతో కమ్మటి విందు కూడా ఏర్పాటుచేశారు.

Latest articles

More like this