HomeNewsAndhra Pradeshవిశాఖకు కార్యాలయాల తరలింపు.. ప్రభుత్వ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ తిరస్కరణ

విశాఖకు కార్యాలయాల తరలింపు.. ప్రభుత్వ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ తిరస్కరణ

Published on

ఏపీలో జగన్ సర్కార్ కి బిగ్ షాక్ తగిలింది. విశాఖకు కార్యాలయాల తరలింపునకు సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. ఈ అంశంపై వచ్చే మంగళవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. సీఎం క్యాంపు కార్యాలయం ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్నారని రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపుతూ ఇటీవల హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశాలిచ్చారు. త్రిసభ్య ధర్మాసనం తగిన ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కార్యాలయాల తరలింపునకు చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో ప్రభుత్వం గురువారం వేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

Latest articles

More like this