HomeNewsకొనసాగుతున్న తెలంగాణ ఎన్నికల పోలింగ్

కొనసాగుతున్న తెలంగాణ ఎన్నికల పోలింగ్

Published on

తెలంగాణలో కీలకమయిన ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.ఓటు వేసేందుకు ఉదయం 7 గంటల నుంచే జనం బారులు తీరారు. సినీ, రాజకీయ ప్రముఖులు కుటుంబాలతో సహా పోలింగ్ బూత్‌‌లకు వచ్చి ఓటు వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కామారెడ్డి బరిలో ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిని బీఆర్‌ఎస్ నేతలు అడ్డుకుంటున్నారు. కొండల్‌రెడ్డి స్థానికేతరుడు అని గులాబీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డిలో బయటి వ్యక్తులు తిరుగుతున్నారని, ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. నాన్‌లోకల్ కాంగ్రెస్ నాయకులు వస్తున్నారంటూ బీఆర్‌ఎస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. పోలింగ్ కేంద్రం వద్ద రోడ్డుపై బైఠాయించి బీఆర్‌ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి.

జనగామ, కామారెడ్డి, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, పాలేరులో చిన్నపాటి ఘర్షణలు జరిగాయి. దాంతో ఆయా జిల్లాల ఘటనలపై సీఈఓ వికాస్ రాజ్ ఆరా తీశారు. వెంటనే ఘర్షణలను అదుపు చేయాలని ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులకు సీఈఓ ఆదేశించారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘనటనలు జరగకుండా చూడాలని డీజీపీని ఆదేశించారు. 12 గంటల వరకూ 40 శాతం వరకూ పోలింగ్ నమోదయిందని అధికారులు చెబుతున్నారు.

Latest articles

More like this