HomeDevotionalపుష్పక విమానంలో అలరించిన తిరుమలేశుడు

పుష్పక విమానంలో అలరించిన తిరుమలేశుడు

Published on

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గోవర్ధనగిరి ధారి అయిన రుక్మిణి స‌త్య‌భామ స‌మేత శ్రీకృష్ణుని అలంకా రంలో శ్రీ మ‌ల‌య‌ప్పస్వామివారు ‌పుష్ప‌క విమానంలో అభ‌య‌మిచ్చా రు.పుష్ప‌క విమానం సేవ‌ ను మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం సంద‌ర్భంగా నిర్వ‌హించే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో నిర్వ‌హిస్తారు. వాహనసేవల్లో అలసిపోయే స్వామి, అమ్మ‌వార్లు సేద తీరడానికి పుష్ప‌క విమానంలో వేంచే పు చేస్తారు.ఈ ప్రత్యేకమైన పుష్ప‌క విమానాన్ని కొబ్బరి చెట్ల ఆకులతో తయారు చేశారు. ఇది 27 అడుగుల ఎత్తు, 15 అడుగుల పొడ‌వు, 14 అడుగుల వెడల్పుతో దాదాపు ఒక ట‌న్ను బ‌రువు ఉంటుంది. ఇందులో 6 రకాల సాంప్ర దాయ పుష్పాలు ఉప‌యోగించారు. శ్రీ‌వారి పుష్ప‌క విమానాన్ని మూడు ద‌శ‌ల‌లో ఏర్పాటు చేశారు. విమానంకు ఇరువైపులా శ్రీ ఆంజ‌నేయ‌స్వా మి, శ్రీ గ‌రుత్మంతుడు, మొద‌టి ద‌శ‌లో అష్టలక్ష్ములు, రెండ‌వ ద‌శ‌లో ప్ర‌భావ‌ళి తో కూడిన అష్ట‌నాగులు, మూడ‌వ ద‌శ‌లో తిరునామాలు, గోపురంతో రూపొం దించారు.తమిళనాడులోని సేలానికి చెందిన 20 మంది, టీటీడీ గార్డెన్ విభాగానికి చెందిన 10 మంది వారం రోజుల ‌పాటు శ్ర‌మించి ఈ అద్భుతమైన విమా నాన్ని సిద్ధం చేశార‌ని టీటీడీ గార్డెన్ విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్‌ శ్రీ శ్రీ‌నివాసులు తెలిపారు. చెన్నైకి చెందిన దాత శ్రీ రాంప్ర‌సాద్ భ‌ట్‌ శ్రీవారి పుష్ప‌క విమానాన్ని ఆకర్షణీ యంగా రూపొందించేందుకు సహ‌కారాన్ని అందిం చారు.

Latest articles

More like this