ఇండియన్స్‌పై వీసా బాంబ్.. ట్రంప్ కీలక నిర్ణయం
H-4వీసా దారులు ఈఏడీ గడువు ముగిసేలోగా యూఎస్సీఐఎస్ నుంచి పర్మిషన్ రాకపోతే .. ఆవ్యక్తి వెంటనే జాబ్ మానేయాల్సి ఉంది. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో H-4ఈఏడీపై ఆధాపడి పనిచేస్తున్న వేలాది మంది ఇండియన్స్ ఆందోళనకు గురవుతున్నాయి

Trump EAD Rule for H-4 Visa Holders
ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో భారతీయులపై తీవ్ర ప్రభావం పడుతోంది. అమెరికాలో ఉండే ఇండియన్స్, వారి కుటుంబ సభ్యులపై ఎఫ్టెక్ చూపుతోంది. ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వర్తించే 540 రోజుల ఆటోమేటిక్ పొడిగింపు నిబంధనను ట్రంప్ సర్కార్ రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ట్రంప్ నిర్ణయంతో H1B వీసాదారుల జీవిత భాగస్వాములైన H-4 వీసా హెల్డర్లకు ఎదరుదెబ్బ(Trump EAD Rule for H-4 Visa Holders) తగిలింది. యూఎస్సీఐఎస్ అక్టోబర్ 14న ఈ నిబంధనలు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గతేడాది 2025 అక్టోబర్ 30న ప్రవేశపెట్టిన తాత్కాలిక విధానాన్ని ట్రంప్ సర్కార్ తాజాగా అమలులోకి తెచ్చింది. గతంలో బైడెన్ పాలనలో 2022లో ఈఏడీ రెన్యూవల్ ప్రాసెసింగ్‌లో నెలకొన్న తీవ్ర జాప్యాన్ని అధిగమించేందుకు 540 రోజుల పొడిగించింది. ఇప్పుడు ఆఉత్వర్వులకు ట్రంప్ ప్రభుత్వం పాతరేసింది.
ట్రంప్ తీసుకున్న లేటెస్ట్ నిర్ణయంతో ఈఏడీ రెన్యూవల్ కోసం దాఖలు చేసిన దరఖాస్తులకు ఈ540 రోజుల ఆటోమేటిక్ పొడిగింపు వర్తించదు. H-4వీసా దారులు ఈఏడీ గడువు ముగిసేలోగా యూఎస్సీఐఎస్ నుంచి పర్మిషన్ రాకపోతే .. ఆవ్యక్తి వెంటనే జాబ్ మానేయాల్సి ఉంది. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో H-4ఈఏడీ(Trump EAD Rule for H-4 Visa Holders)పై ఆధాపడి పనిచేస్తున్న వేలాది మంది ఇండియన్స్ ఆందోళనకు గురవుతున్నాయి. మరోవైపు F-1వీసాపై చదువుతున్న STEM OPT స్టూడెంట్స్‌కు 180డేస్ ఆటోమేటిక్ పొడిగింపు యాథావిధిగా కొనసాగుతుందని అధికారులు క్లారిటీ ఇచ్చారు.
అంతేకాదు నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా పొడిగింపుల విషయంలో గతంలో ఇచ్చిన అనుమతులకు ప్రాధాన్యం ఇచ్చే పద్ధతిని రద్దు చేసే మరో ప్రతిపాదన కూడా ట్రంప్ సర్కార్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ట్రంప్ వరుసగా వేస్తున్న బాంబ్‌లతో అమెరికాలోని ఇండియన్స్ గుండెలు గుబేలు మంటున్నాయన్నాయి.



