Team India ICC Awards and T20 Rankings

సొంత గడ్డపై టీమ్‌ ఇండియా కుర్రాళ్లు వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. సూపర్‌ ఫామ్‌తో రెచ్చిపోతున్నారు. ఇప్పటికే జరిగిన వన్డే సిరీస్‌ను టీమ్‌ ఇండియా 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీమ్‌ ఇండియా వన్డే కెప్టెన్ శుభమన్‌ గిల్ వెస్టిండీస్ సిరీస్‌తో సూపర్‌ ఫామ్‌లోకి వచ్చాడు. ఫస్ట్ వన్డేలో 108 బంతుల్లో 110 రన్స్ చేసి సెంచరీ చేశాడు. రెండో వన్డేలో 133 బంతుల్లో 223 పరుగులు చేశాడు. డబుల్ సెంచరీతో చెలరేగాడు. కేరీర్ తొలి డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ దిమంత్ అవార్డును 5వసారి సొంతచేసుకున్నాడు. మరోవైపు టీమ్‌ ఇండియా మహిళ జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ సైతం ఆసియా కప్, ఒలంపిక్స్ క్రికెట్‌ లో అద్భుత ప్రదర్శన చేసింది. ఐసీసీ ఉత్తమ ప్లేయర్‌గా అవార్డు అందుకుంది( Team India ICC Awards and T20 Rankings) . ఒకే దేశానికి చెందిన ప్లేయర్లు ఒకే సారి అవార్డు అందుకోవడం ఇది అయిదోసారి అయితే.. భారత్ తరపున మూడోసారి. గతంలో బుమ్రా, స్మృతి మంధాన(2024), అభిషేక్‌ శర్మ, స్మృతి మంధాన (2025) ఇలా ఒకేసారి అవార్డు సాధించారు.

మరోవైపు కరేబియన్ జట్టుతో సొంత గడ్డపై జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమ్‌ ఇండియా సూపర్బ్‌ ప్రదర్శన చేస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత సెంచరీతో ర్యాంకుల్లోకి దూసుకొచ్చాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌ (904), అభిషేక్ శర్మ(891), ఫస్ట్, సెకండ్ ప్లేస్‌ ల్లో నిలిచారు. కెప్టెన్ అయ్యర్ (798)మూడు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంకుకు చేరుకున్నాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(731) పదో స్థానం నుంచి తొమ్మదిలోకి చేరాడు(Team India ICC Awards and T20 Rankings ). బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్ రెండు స్థానాలు దిగజారి తొమ్మదో ర్యాంకులో నిలిచాడు.