PM Modi Meets Asian Games Winners: ఆసియా క్రీడల్లో సత్తా చాటిన భారత ఆటగాళ్లతో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో భేటీ అయ్యారు. తన నివాసంలో అథ్లెట్లతో సమావేశమై వారితో సుదీర్ఘంగా సంభాషించారు. ఆసియా క్రీడల్లో రాణించి.. దేశం తరపున సత్తా చాటిన క్రీడాకారులను మోదీ భుజం తట్టి అభినందించారు. గోల్డ్ మెడల్ గెలిచిన హాకీ, క్రికెట్ జట్లతో పాటు ప్రతి అథ్లెట్లతో మోదీ పోటోలు దిగారు. యువ అథ్లెట్లు తమ సంతకం చేసిన జెర్సీలు అందజేశారు. 17ఏళ్ల ఆర్చరీ క్రీడాకారిణి కుంకుమ్‌ మోహద్ విల్లును బహుకరించారు.

ఆసియా క్రీడల్లో భారత్ క్రీడాకారులు సత్తాచాటి .. క్రీడారంగంలో భారత దేశ శక్తిని చాటిచెప్పారని మోదీ అన్నారు. ఈపతకాలు కేవలం సంఖ్యలు కావు.. ఇవి నూతన భారతదేశ శక్తిని ప్రతిబింబిస్తాయని చెప్పారు. ప్రపంచ వేదికలపై మన దేశ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడమే అత్యున్నత విజయం అని ప్రధాని తెలిపారు. దేశానికి కీర్తి తెచ్చిన అథ్లెట్లందరినీ అభినందించారు. మీరు సాధించిన విజయాలు 140కోట్లమంది దేశ ప్రజలందరివని మోదీ చెప్పారు. ముఖ్యంగా క్రీడా వేడుకల్లో మహిళా అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేశారని ప్రశంసించారు. మహిళా అథ్లెట్లు 11 గోల్డ్ మెడల్స్‌ తో పాటు మొత్తం 38 పతకాలు సాధించడం విశేషమని చెప్పారు. మొత్తంగా జపాన్ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ 85 పతకాలు గెలుచుకుంది. ఇందులో 21 గోల్డ్, 27 రజతాలు, 37 కాంస్య పతకాలు ఉన్నాయి.