ఆగని ఆకతాయి ఆగడాలు.. గుడిపై వరుస దాడులు
Mehdipatnam Tension in Hyderabad: హైదరాబాద్ మెహదీపట్నంలో దారుణం జరిగింది. బతుకమ్మ ఆడుతున్న మహిళలపై కోడిగుడ్లు విసిరారు. దీంతో వెంటనే హిందూ సంఘాలు ఆందోళన చేశాయి.

Mehdipatnam Tension in Hyderabad: హైదరాబాద్‌లోని మెహీదీపట్నంలో ఉద్రిక్త పరిస్థితి నెలకుంది. దుర్గగుడి దేవాలయం దగ్గర హిందూ సంఘాలు, స్థానికులు ఆందోళన చేశారు. బతుకమ్మ ఆడుతున్న మహిళలపై ఆకతాయిలు గుడ్లు విసిరారంటూ స్థానికులు అరోపిస్తున్నారు. ఆకతాయిల ఆఢగాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుందంటూ హిందూ సంఘాలు, స్థానికులు గుడి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. హిందూ సంఘాల ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం దగ్గరకు చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిందితులను అరెస్ట్ చేయలంటూ డిమాండ్ చేశారు. పేరుకే అయోధ్య నగర్ .. ఇక్కడ అన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఆలయంపై వాటర్ బాటిళ్లు విసిరారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
హిందూ సంఘాల ఆందోళనతో మరోవైపు దుర్గ గుడి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.. డీసీపీ రాఘవేందర్ రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించి, ఆలయంలోని భక్తులు, పూజారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆందోళనకారులకు నచ్చజెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో అక్కడ పరిస్థితి కొంత సర్ధుమణిగింది. ఆలయం దగ్గర పికెటింగ్ ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నాం.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ హామీ ఇవ్వడంతో హిందూ సంఘాలు ఆందోళన విరమించాయి.



