Telangana IPS Transfers 2026

పోలీస్ శాఖలో భారీ స్థాయిలో ప్రక్షాళన చేపట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఒకేసారి 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. కీలక పోస్టుల్లో కొత్త అధికారులకు బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్‌ను(Telangana IPS Transfers 2026) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లా అండ్‌ ఆర్డర్‌ డీజీపీగా ఉన్న మహేష్‌ మురళీధర్‌ భగావత్‌ ను హైదరాబాద్‌ సీపీగా నియమించింది. ఇప్పటివరకు హైదరాబాద్ సీపీగా బాధ్యతలు నిర్వహించిన సజ్జనార్‌ను తెలంగాణ ఫైర్ సర్వీసెస్ డీజీగా బదిలీ చేసింది. మరోవైపు జైళ్ల శాఖ డీజీగా స్వాతి లక్రా, మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా విభాగాల డీజీగా సౌమ్య మిశ్రాకు బాధ్యతలు అప్పగించింది. ఏసీబీ డీజీగా చారు సిన్హాను నియమించింది.

ఇతర కీలక విభాగాల్లోనూ రేవంత్ సర్కార్‌ భారీ మార్పులు చేపట్టింది. టీజీఎస్ఆర్టీసీ ఎండీగా అనిల్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించింది. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ డీజీగా విక్రమ్ సింగ్ మాన్‌ను నియమించింది. సివిల్ సప్లైస్ కమిషనర్‌గా నాగిరెడ్డికి పోస్టింగ్ ఇచ్చింది. తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విభాగం బాధ్యతలను స్టీఫెన్ రవీంద్రకు(Telangana IPS Transfers 2026) అప్పగించింది. అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా ఆకున్ సబర్వాల్‌ను నియమించింది. మల్టీ జోన్-1 ఐజీగా కార్తికేయను … హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా జోయల్ డేవిస్‌కు అదనపు బాధ్యతలు కట్టబెట్టింది.

శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, మహిళా భద్రత, అవినీతి నిరోధక చర్యలు సహా కీలక విభాగాల్లో కొత్త అధికారుల నియామకాలతో పోలీస్ శాఖలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. మొత్తం 21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై ప్రభుత్వం ఉత్తర్వులు(Telangana IPS Transfers 2026) జారీ చేసింది. రాష్ట్ర పోలీస్ యంత్రాంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ ప్రభుత్వం ఈ బదిలీల ఉత్తర్వులు వెలువరించింది.