లండన్‌లో ఇండియన్స్ నిరసన.. మోదీకి మద్దతుగా ధర్నా

Indians in London Protest
లండన్‌లో ప్రధాని మోదీకి మద్దతుగా ప్రవాస భారతీయులు రోడ్డెక్కారు. లండన్‌లోని భారత హైకమిషన్ బయట మోదీకి సపోర్ట్‌గా త్రివర్ణ పతాకం చేతబూని భారీ నిరసన ప్రదర్శన చేశారు. భారత్ మాతాకీ జై.. మోదీ.. మోదీ.. జై శ్రీరామ్( Indians in London Protest ) అంటూ నినాదాలు చేశారు. నినాదాలతో ఆప్రాంతానంతా హోరెత్తించారు. విదేశీ గడ్డపై భారత్ ప్రతిష్టకు భంగం కలిగేలా జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ గౌరవాన్ని కాపాడతామని స్పష్టం చేశారు. అందుకే తామంతా ఇక్కడ భేటీ అయ్యామని చెప్పారు.
ఇండియాలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, సీజేపీ చేస్తున్న ఆందోళన నేపథ్యంలో లండన్‌లో ఈప్రదర్శన(Indians in London Protest ) చేశారు. మోదీకి మద్దతుగా నినాదాలు చేశారు. భారత్ కు వ్యతిరేకంగా చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. మోదీ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్లే భారతదేశం ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడుతుందని.. అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. తల్లిదండ్రుల డబ్బుతో బ్రిటన్‌కు వచ్చిన కొందరు స్టూడెంట్స్ దేశ వ్యతిరేక శక్తులతో కలిసి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని నిరసనకారులు మండిపడ్డారు. భారత రాజకీయాల గురించి భారత్‌లోనే చర్చిద్దాం.. ఇక్కడేందుకు దేశం పరువుతీసే పనులు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. రాజ్యంగ సంస్థలను .. భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేలా ప్రతిపక్ష పార్టీలు, రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.



