కట్టలు తెంచుకున్న ఆగ్రహం.. తగలబడిన ఫ్రాన్స్

France Violent Protests
తీవ్రవైన ప్రజానిరసనలతో యూరప్ దేశాలు అట్టుడుకుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన ఈదేశాలు పెరిగిన రోజువారీ ఖర్చులు, తక్కువ జీతాలు, ఆకాశన్నంటిన ఇంటి అద్దెలతో ప్రజల్లో వ్యతిరేకత కట్టులు తెంచుకుంది. ప్రజా సేవలకు వ్యతిరేకంగా లక్షలాది మంది రొడెక్కారు. మొదట విద్యారంగంలో సంస్కరణలను వ్యతిరేకిస్తూ స్టూడెంట్స్ నిరసనలు చేపట్టారు. వారి ఆందోళనకు కార్మిక సంఘాలు, సామన్య ప్రజలు తోడవడంతో ఉధృతం అయ్యాయి. తీవ్ర రూపం దాల్చాయి.
ఒకప్పుడు ప్రపంచాన్ని శాంసించిన ఫ్రాన్స్(France Violent Protests ), బెల్జియం, పోర్చుగల్, ఇటలీ వంటి దేశాల్లో ఇప్పుడు ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. దీంతో నిత్యవసర సరుకులు, ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. సామాన్యులు బతికే పరిస్థితి కనపించడం లేదు. నిత్యవసరాలు భారంగా మారడంతో ఫ్రాన్స్(France Violent Protests )లో సామ్యానుల ఆగ్రహం కట్టలుతెంచుకుంది. జీవన వ్యయానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ప్రజా నిరసనల్లో ఫ్రాన్స్‌లో చారిత్రక కట్టడంగా గుర్తింపు పొందిన లియోజెస్ టౌన్ హాల్ భవనం ధ్వంసం అయింది. 143ఏళ్ల చరిత్ర కల్గిన ఈలిమోజెస్ టౌన్ హాల్ భవనం తగలబడింది. ఆందోళన కారులు ఆటౌన్ హాల్‌కి నిప్పుపెట్టడంతో ఈ విధ్వంసం జరిగింది. అయితే ఈ భవనం 1873లో నిర్మాణం ప్రారంభ కాగా.. 1883లో అధికారికంగా ప్రారంభించారు. టౌన్ హాల్ ధ్వంసం కావడంపై స్థానిక ప్రిఫెక్ట్ మారిన్ బరేట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దేశ వారసత్వ సంపదకు ఘోర విపత్తు అని అన్నారు. నిరసనకారుల ముసుగులో దుండగులు ఉద్దేశపూర్వకంగానే టౌన్ హాల్‌ను ధ్వంసం చేశారని ఆయన ఫైర్ అయ్యారు.
అయితే ఈనిరసనలు ఒక్క ఫ్రాన్స్(France Violent Protests )తో ఆగలేదు. పారిస్ తో పాటు మార్సెల్, లియోన్, లిల్లే వంటి నగరాల్లోనూ హింసకు దారితీశాయి. ఆందోళనకారులు దొంగతనాలకు, దహనకాండలకు పాల్పడ్డారు. నిరసనల్లో హింసాకాండకు పాల్పడ్డ ఆందోళనకారులను గుర్తించి పోలీసులు అరెస్ట్‌లు చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 1200మందిని అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులు ఆందోళనల్లో 150మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. ఫ్రాన్స్ జరిగిన హింసను ఆదేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తీవ్రంగా తప్పుబట్టారు. దేశ గణతంత్రంలో హింసకు తావులేదన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు. మరోవైపు ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు ఎక్స్ వేదికగా స్పందించారు. ఫ్రాన్స్‌లో జరిగిన హింసకు ఆదేశ వలస విధానాలే కారణమన్నారు.



