సవాళ్లకే సై.. కోచ్ దూరమైన వీడని పట్టుదల
పవర్ లిఫ్టింగ్ పోటీలో ఏక్తా బిష్ణోయ్ మొత్తం 362. 5 కిలోల వెయిట్‌ను లిఫ్ట్ చేశారు. ఒకవైపు ఐఆర్ఎస్గా ప్రభుత్వ బాధ్యతలు నిర్వహిస్తూనే.. కఠినమైన పవర్ లిఫ్టింగ్ శిక్షణను కొనసాగించారు. జపాన్, కెనడాకు చెందిన బలమైన ప్రత్యర్థులను అధిగమించారు

Ekta Bishnoi Powerlifting
అమెరికాలో భారత్‌కు చెందిన ఇండియన్ రెవిన్యూ సర్వీస్ (IRS) అధికారిని ఎక్తా బిష్ణోయ్( Ekta Bishnoi Powerlifting) పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటారు. క్రీడా ప్రపంచంలో హిస్టరీ క్రియేట్ చేశారు. అమెరికాలో జరిగిన వరల్డ్ మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించారు. మాస్టర్స్-2 విభాగంలో గోల్డ్ మెడల్ గెలిచిన తొలి ఇండియన్ మహిళగా రికార్డుకెక్కారు. ప్రపంచ రికార్డు సృష్టించారు. భారతదేశం గర్వపడేలా చేశారు.
పవర్ లిఫ్టింగ్ పోటీలో ఏక్తా బిష్ణోయ్ మొత్తం 362. 5 కిలోల వెయిట్‌ను లిఫ్ట్ చేశారు. ఒకవైపు ఐఆర్ఎస్గా ప్రభుత్వ బాధ్యతలు నిర్వహిస్తూనే.. కఠినమైన పవర్ లిఫ్టింగ్ శిక్షణను కొనసాగించారు. జపాన్, కెనడాకు చెందిన బలమైన ప్రత్యర్థులను అధిగమించారు. ప్రపంచ వేదికపై జాతీయ జెండాను రెపరెపలాడించారు. క్రీడలపై ఎక్తా బిష్ణోయ్(Ekta Bishnoi Powerlifting)కి ఉన్న ఆశక్తి .. మెడల్స్ సాధించాలనే ఆమె అంకితభావం దేశాన్ని ఈరోజు గర్వపడేలా చేసింది.
అయితే ఏక్తాకు ఈ విజయం అంత సులువుగా దక్కలేదు. ఈటోర్నమెంట్కు ముందు భారత జట్టు కోచ్ సునీల్ కుమార్ US వీసా క్యాన్సిల్ అయింది. దీంతో కోచ్ టోర్నీకి దూరమయ్యారు. కోచ్ ఈటూర్‌కి రాకపోయినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు ఆమె. వీడియో కాల్స్ ద్వారా కోచ్ సునీల్ నుంచి సూచనలు తీసుకున్నారు. టీమ్ అధికారి ఇబ్రహీం సపోర్ట్‌తో చాకచక్యంగా ఆడి చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సాధించారు. ఎక్తా బిష్ణోయ్(Ekta Bishnoi Powerlifting
) గెలుపుతో కోచ్ సునీల్ కుమార్ భావోద్వేగానికి గురయ్యారు. అమె సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈటోర్నీలో తాము ముందునుంచే వ్యూహంతో ముందుకెళ్లామన్నారు. బెంచ్ ప్రెస్‌లో ఆధిక్యాన్ని నిలబెట్టుకుని .. చివరకు 150కిలోల డెడ్ లిఫ్ట్‌తో ఇండియాకు గోల్డ్ మెడల్ సాధించామని చెప్పారు. ఎక్తా బిష్ణయ్ను చూస్తూ గర్వంగా ఉందన్నారు.



