HomeDevotionalఉదయనిధి స్టాలిన్ కి సుప్రీం షాక్

ఉదయనిధి స్టాలిన్ కి సుప్రీం షాక్

Published on

తమిళనాడు మంత్రి, సీఎం తనయుడు ఉదయనిధి స్టాలిన్ కి సుప్రీంకోర్టు షాకిచ్చింది. సామాజిక ధర్మానికి సనాతన ధర్మం వ్యతిరేకమని, సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలని అన్నారు. సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియా వంటి రోగాలతో పోల్చిన సంగతి తెలిసిందే. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. పలు స్టేషన్లలో ఫిర్యాదులు వచ్చాయి. ఆయన వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం ఉదయనిధితో పాటు తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.జస్టిస్ అనిరుద్ధ బోస్, బేల ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం ఈ నోటీసులు జారీచేసింది. తన వ్యాఖ్యలపై ఆయన వెనక్కి తగ్గలేదు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, ఎలాంటి పరిణామాలకైనా సిద్ధమన్నారు ఉదయ నిధి. హిందూ సంస్థలు ఉదయనిధి స్థాలిన్ పై మండిపడ్డాయి. ఆయన తల తెస్తే రివార్డు కూడా ప్రకటించాయి.

Latest articles

More like this