HomeNewsNationalదేశంలో మరోసారి మోడీ హవా...ఏబీపీ సీ-ఓటర్‌ సర్వే ఏం చెబుతోంది?

దేశంలో మరోసారి మోడీ హవా…ఏబీపీ సీ-ఓటర్‌ సర్వే ఏం చెబుతోంది?

Published on

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో మోడీ హవా ఖాయమా?
మరోసారి ప్రధానిగా నరేంద్రమోడీ?
ఏబీపీ సీ ఓటర్ సర్వే సంచలన విషయాలు
ఎన్డీయే కూటమికే మళ్లీ అధికారం
ఎన్డీయేకి 295 నుంచి 352 సీట్లు
ఇండియా కూటమికి 165 నుంచి 205 సీట్లు
హ్యాట్రిక్ పీఎంగా నరేంద్రమోడీ మరోరికార్డు

దేశంలో రాబోయే ఎన్నికల్లోనూ కమలం తన సత్తా చాటనుందా? అంటే అవుననే అంటోంది ఏబీపీ సీ ఓటర్ సర్వే. ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి రాబోతున్నట్లు ఏబీపీ సీ-ఓటర్‌ సర్వే సంచలన సర్వే తేల్చింది. గత పార్లమెంటు ఎన్నికల్లో 352 సీట్లతో తిరుగులేని విజయం సాధించిన కూటమి ఈ సారి కూడా 295 నుంచి 335 సీట్ల వరకూ గెలిచి విజయభేరి మోగించనుంది.ప్రతిపక్ష ఇండియా కూటమి (India Alliance) 165 నుంచి 205 సీట్లతో సరిపెట్టుకుంటుందని సర్వే వెల్లడించింది. ఇతరులు 35 నుంచి 65 సీట్లలో గెలిచే అవకాశముందని పేర్కొంది. 2024 పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి వెల్లడైన తొలి ఒపీనియన్‌ ఇదే కావడంతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

పశ్చిమ భారత్‌లో 78 సీట్లలో ఎన్డీఏ (NDA) కూటమి 45 నుంచి 55 సీట్లలో, ప్రతిపక్ష కూటమి 25 నుంచి 35 సీట్లలో గెలవొచ్చని సర్వే అంచనా వేసింది. తూర్పుభాగంలోని 153 సీట్లలో ఎన్డీఏ 80 నుంచి 90 సీట్లు గెలిచే అవకాశముండగా, విపక్ష ఇండియా కూటమి 50 నుంచి 60 సీట్లు పొందొచ్చని ఏబీపీ సీ ఓటర్‌ సర్వే పేర్కొన్నది. తూర్పు భారత్‌ ప్రాంతంలో ఓటింగ్‌ శాతం విషయంలో బీజేపీ (BJP) ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 42శాతం ఓట్లు సాధించవచ్చని, ఇండియా కూటమిలోని పక్షాలకు 38 శాతం ప్రజలు ఓట్లు వేయవచ్చని వెల్లడించింది.

దక్షిణ భారత ప్రాంతంలో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ 132 సీట్లలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 20 నుంచి 30 సీట్లు గెలుచుకోగలదన్న ఏబీపీ సీ ఓటర్‌ సర్వే, విపక్ష ఇండియా కూటమికి 70 నుంచి 80 సీట్లు వచ్చే అవకాశముందని తేల్చింది. మరో 25 నుంచి 35 సీట్లు ఇతరుల ఖాతాలో పడతాయని అంచనా వేసింది. ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుందన్న విషయమై దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజలను ప్రశ్నించగా, తమిళనాడులో 53 శాతం మంది ప్రజలు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) ప్రాధాన్యమివ్వగా, 31 శాతం మంది ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ పేరునే ఎంచుకున్నారు. 2 శాతం మంది ఇద్దరిలో ఎవరూ వద్దని స్పష్టంచేయగా, మరో 14శాతం మంది తామేమీ చెప్పలేమన్నారు. ఓట్ల శాతం విషయానికొస్తే దక్షిణాదిలో విపక్ష ఇండియా కూటమి 40 శాతం ఓట్లు సాధిస్తుందని, ఎన్డీయేకు 19 శాతం ఓట్లు రావొచ్చని సర్వే అంచనా వేసింది. ఇతర పార్టీలు 41 శాతం ఓట్లు పొందగలవని తేల్చేసింది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్‌లలో కలిపి 132 లోకసభ స్థానాలున్నాయి.

ఈసారి ఎన్నికలు జరిగితే.. ఎన్డీఏ గరిష్టంగా 42 శాతం ఓట్లు సాధించగలదని ఏబీపీ సీ ఓటర్‌ సర్వే చెబుతోంది. ప్రతిపక్ష ఇండియా కూటమికి 38 శాతం, ఇతరులకు మరో 20శాతం ఓట్లు లభించవచ్చని సర్వే తేల్చింది.

Latest articles

More like this