HomeNewsNationalలోక్ సభలో టెన్షన్..టెన్షన్

లోక్ సభలో టెన్షన్..టెన్షన్

Published on

టియర్ గ్యాస్ వదిలిన అగంతకులు
2001లో ఇదే రోజు పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి
22 ఏళ్ల తర్వాత పార్లమెంట్‌పై మరోసారి దాడి
హఠాత్ పరిణామంతో ఉలిక్కిపడ్డ ఎంపీలు
సభను వాయిదా వేసిన ప్యానెల్ స్పీకర్
నలుగురికి విచారిస్తున్న భద్రతాసిబ్బంది

ఎంతో భద్రత ఉండే భారత పార్లమెంటులో భాగమయిన లోక్ సభలో బుధవారం టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్యాలరీ నుంచి ఇద్దరు అగంతకులు లోక్‌సభలోకి దూకి టియర్ గ్యాస్‌ను వదలడంతో అసలేం జరుగుతుందో తెలీని పరిస్థితి ఏర్పడింది. అగంతకులు రాజ్యాంగాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. నల్లచట్టాలను రద్దుచేయాలి అంటూ పసుపు, ఎరుపు రంగు పొగను వదిలారు.దీంతో వెంటనే ప్యానల్ స్పీకర్ సభను వాయిదా వేశారు.ఈ హఠాత్ పరిణామంతో ఎంపీలు భయంతో బయటకు పరుగులు తీశారు.ఎంతో కట్టుదిట్టంగా ఉండాల్సిన కొత్త పార్లమెంట్‌ భవనంలో భద్రతా వైఫల్యం ఆందోళన కలిగిస్తోంది. స్పీకర్‌ వైపు ఓ ఆగంతకుడు పరిగెత్తాడు. కాగా 2001లో ఇదే రోజు పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి చేసిన సంగతి తెలిసిందే. 9 మంది ఈ దాడిలో అమరులు అయ్యారు. 22 ఏళ్ల తర్వాత పార్లమెంట్‌పై మరోసారి దాడి జరిగింది. కొత్త పార్లమెంట్ లోక్‌సభలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగిందని.. దీని వెనుక ఎవరున్నారు అనేది తేల్చాలని ఎంపీలు అన్నారు. నలుగురు దుండగులను అదుపులోకి తీసుకుని భద్రతా దళాలు ప్రశ్నిస్తున్నారు

2 సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ, మండలి భవనాలు
గ్రీనరీకి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు
అసెంబ్లీ కి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు
రైల్వేగేటుకి ఆనుకుని ఉన్న గేటు ఎత్తు పెంపు
సభ్యులు ఉదయం వాకింగ్ చేసుకునేలా ఏర్పాట్లు

తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. పార్లమెంట్ నమూనా తరహాలో తెలంగాణ అసెంబ్లీ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనసభ,శాసన మండలి ఓకే దగ్గర నిర్మాణం ఉంటుందన్నారు. శాసనసభ, శాసన మండలి మినహా మరే ఇతర బిల్డింగ్స్ అసెంబ్లీ ప్రాంగణం లోపల ఉండవని రేవంత్ తేల్చి చెప్పారు. ఇప్పుడు ఉన్న చెట్లను తొలగించకుండా మరింత గ్రీనరీ పెంచాలన్నారు. అసెంబ్లీ కి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైల్వే గేట్‌కు అనుకుని ఉన్న ప్రహారీ గోడ ఎత్తు పెంచాలన్నారు. మెంబర్స్ ఉదయం పూట వాకింగ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

3 కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ హాట్ కామెంట్స్
తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య మాటల దాడి
కాంగ్రెస్ పాలకుకు అసలు ఆట మొదలైంది
సాధ్యంకాని హామీలతో ప్రజల్ని మభ్యపెడుతోందన్న కేటీఆర్
కాంగ్రెస్ హయాంలో ఏ పద్దులపై చర్చ జరగలేదు
మేం ఏటా వివిధ పద్దులపై శ్వేతపత్రాలు విడుదల చేశాం

కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య మాటల దాడి కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మభ్య పెడుతోందని మండిపడ్డారు. శాసనసభ ఆవరణలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు అమలుకు సాధ్యంకాని హామీలు ఇస్తున్నారని, ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 45 వేల ఉద్యోగాలిస్తాం అన్నారు. అది సాధ్యమేనా? అన్ని ఉద్యోగాలు ఎలా ఇస్తారని అడిగితే స్పష్టంగా చెప్పడంలేదు. కాంగ్రెస్ పాలకులకు అసలు ఆట ఇప్పుడు మొదలైందన్నారు కేటీఆర్.

4 మహాలక్ష్మి పథకంతో పెరిగిన ఆక్యుపెన్సీ
ఆర్టీసీలో ఒక్కరోజే రికార్డుస్థాయిలో ప్రయాణికులు
ఆదివారం 41 లక్షలమంది ప్రయాణం
సోమవారం 50 లక్షలమంది ప్రయాణం
రికార్డు స్థాయిలో ప్రయాణించిన మహిళలు
కార్తీకమాసం కావడంతె దేవాలయాలకు మహిళలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆరుహామీల అమలు ప్రారంభం అయింది. సోనియాగాంధీ బర్త్ డే అయిన డిసెంబర్ 9వ తేదీన ప్రారంభం అయిన మహాలక్ష్మి ఉచిత ప్రయాణానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో సోమవారం రికార్డు స్థాయిలో ప్రయాణికుల రాకపోకలు సాగించారు. 50 లక్షల మందికి పైగా బస్సుల్లో ప్రయాణించినట్లు ఆర్టీసీ ఈడీ మునిశేఖర్‌ వివరించారు. ఆదివారం సుమారు 41 లక్షలున్న ఈ సంఖ్య సోమవారానికి మరో 9 లక్షలు పెరిగింది. ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడం.. కార్తిక మాసం ఆఖరి సోమవారం కావడంతో మహిళలు రికార్డు స్థాయిలో బస్సుల్లో ప్రయాణాలు చేశారు. ఈ రద్దీని ముందే ఊహించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు రెగ్యులర్‌తో పాటు స్పేర్‌ బస్సులను నడిపించగా డ్రైవర్లు, కండక్టర్లు వారాంతపు సెలవు తీసుకోకుండా విధులు నిర్వహించారు. బస్సుల్లో ప్రయాణించిన మహిళా ప్రయాణికుల సంఖ్యను నమోదు చేసుకున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.

5 మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఫిర్యాదు

గిరిజనుల భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు

42 ఎకరాలను కబ్జా చేశారని శామీర్ పేట పీఎస్‌లో ఫిర్యాదు

మల్లారెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చుట్టూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాదు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా వందలాది ఎకరాలు ఆయన కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మల్లారెడ్డి విషయంలో ఏం జరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది. పాలమ్మినా.. పూలమ్మినా అంటూ సోషల్ మీడియాలో ఆయన వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి. గిరిజనుల భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు అందింది. 42 ఎకరాలను కబ్జా చేశారని శామీర్ పేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు బాధితులు. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్చే మల్లారెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ సాగుతోంది.మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు.మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు 9 మందిపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ నమోదు అయ్యింది.ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మార్వోతో పాటు మల్లారెడ్డిపై ఫిర్యాదు రావడంతో నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

Latest articles

More like this