Detective Inspector Balswamy: ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్‌లో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌ (DI)గా పనిచేస్తున్న బాలస్వామి పోలీస్‌ కస్టడీ( Balswamy police custody) కొనసాగుతుంది. మూడు రోజులుగా సైదాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఇవాళ్టితో డిఐ బాలస్వామి కస్టడీ ముగియనుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడడ్డారంటూ ఓ బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో బాలస్వామిపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదైంది. ఈనెల 10న సైదాబాద్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్‌కు పంపారు.

2016లో ఓకేసు విషయంలో బాలస్వామిని బాధిత మహిళ కలిసింది. ఆపరిచయం కాస్తా ప్రేమగా మారిందని ఆమహిళ చెప్పింది. 2017 నుంచి బాలస్వామి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నారని .. మానసికంగా వేధించాడని బాధిత మహిళ ఆరోపించారు. తన భర్త 2021లో మరణిస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఆతర్వాత పలు సార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. ఈక్రమంలోనే బాల స్వామి పెళ్లి చేసుకున్నారని.. 2024లో భార్య పిల్లలలో కలిసి ఉంటున్న విషయం తెలిసి ప్రశ్నించడంతో ముఖం చాటేశారని .. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పారని భాదితురాలు తెలిపింది.  బాలస్వామిని నమ్మి పూర్తిగా నమ్మి మోసపోయానని గ్రహించిన బాధిత మహిళ ఢిప్రెషన్ నుంచి బయటపడి చివరకు పోలీసులను ఆశ్రయించింది. సైదాబాద్ పోలీసులు BNS 69, 81, 351(2), 352 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. బాలస్వామిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో ఏం తేలుతుంది? అనేది ఉత్కంఠ రేపుతుంది.