Cristiano Ronaldo Retirement

23 ఏళ్ల ప్రయాణం
ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన అంతర్జాతీయ కెరీర్‌కు ఇక గుడ్‌బై చెప్పాడు. ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశాడు. పోర్చుగల్ జాతీయ జట్టు తరఫున 23 ఏళ్ల పాటు మైదానంలో పోరాడిన అతడు.. ఇకపై జాతీయ జట్టు జెర్సీలో కనిపించబోనని(Cristiano Ronaldo Retirement) స్పష్టం చేశాడు. ఎక్స్‌లో భావోద్వేగ వీడియో విడుదల చేశాడు. తన నిర్ణయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తనకు ఎంతో ప్రత్యేకమైన 7వ నంబర్ జెర్సీని తర్వాతి తరం ఆటగాడికి అందిస్తానని చెప్పాడు. పోర్చుగల్ కోసం తన శక్తినంతా ధారపోశానని.. తన ప్రస్థానం పట్ల ఎంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు.

రికార్డుల రారాజు
రొనాల్డో పేరు ఉంటేనే రికార్డులు గుర్తుకొస్తాయి. పోర్చుగల్ దేశం తరఫున 234 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 146 గోల్స్‌ సాధించాడు. ప్రపంచ ఫుట్‌బాల్‌లో చెరగని ముద్ర వేశాడు. 2016లో పోర్చుగల్‌కు తొలి యూరో కప్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 2019, 2025లో నేషన్స్ లీగ్ టైటిళ్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఆరు ప్రపంచకప్ టోర్నీల్లో గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. యూరో కప్ చరిత్రలో అత్యధికంగా 14 గోల్స్, 30 మ్యాచ్‌ల రికార్డులు కూడా అతడి పేరిటే ఉన్నాయి. అయితే ఇన్ని ఘనతలు సాధించినా ప్రపంచకప్ మాత్రం అందని కలగానే మిగిలిపోయింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు(Cristiano Ronaldo Retirement) పలికినా క్లబ్ ఫుట్‌బాల్‌లో మాత్రం రొనాల్డో ప్రయాణం కొనసాగనుంది. అల్ నసర్ తరఫున ఆడుతూ 1,000 గోల్స్ మైలురాయి దిశగా అడుగులు వేస్తున్నాడు. జాతీయ జట్టుకు గుడ్‌బై చెప్పినా.. ఫుట్‌బాల్ చరిత్రలో రొనాల్డో పేరు మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది..!

ఆఘటన తర్వాతే..
రొనాల్డో అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలకడం వెనుక ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. పోర్చుగల్ జట్టులో చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ప్రధాన కోచ్ జార్జ్ జీసస్‌తో తలెత్తిన విభేదాల కారణంగానే రొనాల్డో కీలక నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్ 27న నార్వేతో జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్ 2-1తో విజయం సాధించినప్పటికీ.. రొనాల్డోకు ఆడే అవకాశం రాలేదు. తనకు ఆట సమయం ఇస్తానని కోచ్ హామీ ఇచ్చి మాట తప్పారని రొనాల్డో ఆరోపించాడు. దీంతో అసంతృప్తికి గురైన అతడు జట్టు శిబిరం నుంచి వెళ్లిపోయాడు. ఈ వ్యవహారంపై పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య 30 రోజుల సస్పెన్షన్‌తో పాటు 255 యూరోల జరిమానా విధించింది. అయితే తర్వాత రొనాల్డో తన తప్పును అంగీకరించి సహచర ఆటగాళ్లు, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఈ వివాదం తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు(Cristiano Ronaldo Retirement) పలకడం ఫుట్‌బాల్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.