కమ్మేసిన పొగమంచు.. 12మందిని మింగేసిన ప్రమాదాలు
బల్గేరియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగమంచు 12 మందిని పొట్టన పెట్టుకుంది. దట్టమైన పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరుసగా రెండు చోట్ల వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

Bulgaria Sofia Burgas Motorway Accident
బల్గేరియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగమంచు 12 మందిని పొట్టన పెట్టుకుంది. దట్టమైన పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరుసగా రెండు చోట్ల వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 50మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బల్గేరియా రాజధాని సోఫియా(Bulgaria Sofia Burgas Motorway Accident) నుంచి నల్ల సముద్ర తీరంలోని బర్గాస్ పోర్టు నగరానికి వెళ్లే జాతీయ రహదారిపై ఈ ప్రమాదాలు జరిగాయి. దట్టమైన పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
ఈ ఘటనలో 10 మంది ప్రమాద స్థలంలోనే మరణించగా, మరో ఇద్దరు ఆసుపత్రికి తరలించే సమయంలో ప్రాణాలు విడిచారు. మొత్తం 50 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి కాట్యా ఇవ్కోవా వెల్లడించారు. ప్రమాదాల నేపథ్యంలో అధికారులు రహదారిపై రాకపోకలను రెండు వైపులా నిలిపివేశారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. దట్టమైన పొగమంచు కారణంగా ఒకేసారి రెండు భారీ ప్రమాదాలు జరగడం బల్గేరియా(Bulgaria Sofia Burgas Motorway Accident)లో తీవ్ర విషాదాన్ని నింపింది. ట్రాకియా మోటార్‌వేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాద తీవ్రత డ్రోన్ దృశ్యాల్లో బయటపడింది. దట్టమైన పొగమంచు కారణంగా కార్లు, భారీ ట్రక్కులు సహా 50కి పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొని భారీ ప్రమాదం సంభవించింది. ప్రమాదం బల్గేరియా చరిత్రలోనే అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. రోడ్డుపై ఒకదానికొకటి ఢీకొని.. డ్రోన్ కెమెరాలో రికార్డైన దృశ్యాల్లో రహదారిపై ఎక్కడికక్కడ ధ్వంసమైన కార్లు, ట్రక్కులు కనిపిస్తున్నాయి. సహాయక చర్యలకు కూడా ఆటంకం ఏర్పడింది.
SCENE: 🇧🇬 Deadly accident on a motorway in Bulgaria killing eleven people died and injuring dozens https://t.co/oflq9ZnBGE
— ShanghaiEye🚀official (@ShanghaiEye) November 10, 2026



