హారన్ మోగితే.. జేబు గుల్లే
Unnecessary Honking Fine: అనవసరంగా హారన్ మోగించే వారిపట్ల ఇకపై పోలీసులు కఠినంగా వ్యవహారించనున్నారు. న్యూసెన్స్ చేసినా.. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా.. సిగ్నల్స్ జంప్ చేసినా భారీగా ఫైన్లు విధిస్తామని.. పలు సెక్షన్ల కింది కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Unnecessary Honking Fine:
కండీషన్స్ అప్లై..!
ఆకతాయిల ఆకట్టించేందుకు తెలంగాణ రవాణా శాఖ కంకణం కట్టుకుంది. ట్రాఫిక్‌లోనే కాదు.. మిగతా సమయంలో రోడ్లపై న్యూసెన్స్ చేసేవారిని తాటా తీస్తామంటూ తాజాగా వార్నింగ్ పాస్ చేసింది. బైక్‌కి, కారుకి వచ్చిన హారన్ కాకుండా పెద్దగా మోగే హారన్‌లను బిగించుకున్నా.. సైలెన్సర్లలతో న్యూసెన్స్ చేసినా కటకటాలపాలవుతారని హెచ్చరించారు. ఈనిబంధనలు సిటీలలోనే కాదు.. అన్నిచోట్ల అమలవుతాయని తెలిపింది. అయితే కొందరు కుర్రాళ్లు రోడ్లపై జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తుంటారు. వెళ్లేదేకాక.. హారన్‌లతో మోత మోగిస్తారు. అక్కడ ఉన్నవారిని ఇబ్బందికి గురిచేస్తారు. బైక్, కారు నడిపేటప్పుడు కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. మరికొందరైతే అవి ఉపయోగించిన పాపానే పోరు. వాళ్ల ఇష్టమెచ్చినట్లు తిప్పేస్తారు. రోడ్డుపై వెళ్లేవారిని తీవ్ర ఇబ్బందులకు చేస్తారు. ఇకపై అలా చేస్తే కుదరదని హెచ్చరిస్తున్నారు పోలీసులు. రవాణా నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఫాలో కావాల్సిందేనని చెప్తున్నారు. అలాకాదని నిబంధనలు అతిక్రమిస్తే చలాన్ల రూపంలో జేబులు గుల్లా చేస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
నో హారన్ జోన్స్.!
బైక్‌కు కాని, కారు కాని హారన్ ఇచ్చింది రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను, పాదచారులను అప్రమత్తం చేయడం కోసమే కాని .. అదే హారన్ ఉపయోగించి ట్రాఫిక్ ముందన్న వారిని తొందరపెట్టేందుకు కాదని స్పష్టం చేశారు పోలీసులు. రెడ్ సిగ్నల్ పడినప్పుడు.. ఎవరైనా ఆగితే.. అదే టైంలో ఒకవేళ కాలిగా రోడ్డు ఉన్నా.. వెనకాల ఉన్న వాడు ఒకటే హారన్ మోగిస్తుంటాడు. అలా మోగించి తొందరపెట్టడం.. అనవసరంగా హారన్ మోగించడం వల్ల శబ్ధకాలుష్యం పెరుగుతుందని తెలిపింది రవాణాశాఖ. ముఖ్యంగా రాత్రి వేళల్లో నివాస ప్రాంతాల్లో, అలాగే ఆస్పత్రులు, స్కూల్స్, కోర్ట్ ప్రాంగణాల ప్రాంతాల్లో హారన్ మోగించొద్దని వార్నింగ్ ఇచ్చింది. డేంజర్ మలుపులు, ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని ప్రాంతాలు, ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో మాత్రమే ఇతరులను అలర్ట్ చేయడం కోసం అది.. పరిమితంగా .. ఒకటి లేదా రెండు సార్లు లిమిట్‌లో .. తక్కువ సమయం హారన్ మోగించాలని (Unnecessary Honking Fine)సూచించారు పోలీసులు.
పలు సెక్షన్ల కింద కేసులు..!
అలా కాదని .. నన్నెవరూ చూడడం లేదని రవాణా శాఖ నిబంధనలు అతిక్రమిస్తే మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 194F ప్రకారం సంబంధిత శాఖాధికారులు కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపింది. సిగ్నల్ వేయకుండా టర్న్ తీసుకుంటే సెక్షన్ 177 సహా నిబంధనల చర్యలు (Unnecessary Honking Fine)ఉంటాయిని హెచ్చరించింది. ఒకవేళ రోడ్లపై వెళ్లేటప్పుడు వాహనాలకు రిపేర్లకు గురైతే .. పరిస్థితిని బట్టి.. వీలైనంత సురక్షిత ప్రదేశంలో పార్క్ చేయాలని.. హాజర్డస్ లైట్లు ఆన్ చేయాలని సూచించింది. అంతేకాకుండా వాహదారులు రోడ్డుప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తం చేయాలని తెలిపింది. ఈ నిబంధనలన్నీ ఈక్షణం నుంచే అమలులోకి వస్తాయని రవాణా శాఖ తెలిపింది. అతిక్రమిస్తే వేటు తప్పదని హెచ్చరించింది.



