ఉత్తరప్రదేశ్లో భర్తను చంపిన భార్య
Wife Kills Husband in Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియుడి కోసం భర్తను దారుణంగా హతమార్చింది. తన తండ్రి ఎవరంటూ కుమారుడు అడిగిన ప్రశ్నలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.

Wife Kills Husband in Uttar Pradesh: ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది. ముక్కలు ముక్కలు చేసి డ్రమ్ములో పెట్టి కాంక్రీట్ చేసేసింది. చేసిన పాపం సమాధైపోయిందనుకుంది. కానీ కన్నకూతురి సాక్ష్యంతో చట్టానికి దొరికిపోయింది. చివరికి ప్రియుడితో కలిసి ఉరికంబం ఎక్కబోతోంది. 2025లో యూపీ మీరట్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన బ్లూడ్రమ్ మర్డర్ కేసులో హతుడి భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాకు కోర్టు మరణశిక్ష విధించింది.
భార్య, ఆమె ప్రియుడి కిరాతకానికి మాజీ మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ బలయ్యాడు. తండ్రిని తల్లి తన ప్రియుడి సాయంతో డ్రమ్ములో కాంక్రీట్ చేసిన విషయాన్ని కూతురు బయటపెట్టింది. సౌరభ్ హత్య తర్వాత కూతురు అతని తల్లిదండ్రుల దగ్గరే ఉంటోంది. అయితే ప్రియుడితో సంబంధంతో అరెస్ట్ అయ్యే సమయానికే గర్భవతిగా ఉన్న ముస్కాన్.. పోయినేడాది నవంబరులో జైల్లోనే మరో ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లి ఉరికంబం ఎక్కితే ఆ చిన్నారి భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నగా మిగిలింది.
ముస్కాన్ జన్మనిచ్చిన ఆ చిన్నారి తండ్రి ఎవరనే విషయంలో సౌరభ్ కుటుంబం అనుమానాలు వ్యక్తంచేస్తోంది. ప్రియుడి కారణంగానే ఆ బిడ్డ పుట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఆ చిన్నారికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని.. ఆ బిడ్డ సౌరభ్ కూతురని తేలితే స్వీకరించేందుకు సిద్దమంటోంది ఆ కుటుంబం. దీంతో డీఎన్‌ఏ పరీక్ష తేలేదాకా ఆ చిన్నారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే ఉండబోతోంది. నైతిక విలువలు మర్చిపోయి ప్రియుడికోసం భర్తను కడతేర్చిన ముస్కాన్ చివరికి ప్రియుడితో పాటు ఉరికంబానికి వేలాడబోతోంది. తన కడుపున పుట్టిన పాపానికి తల్లిదండ్రుల్లేని అనాథలా ఆ పసికందు మిగలబోతోంది.



