క్రైమ్ కిల్లర్ స్టోరీ.. ఏడుగురిని చంపిన భర్త
Bengaluru 7 Murders: బెంగళూరులో ఇందుశేఖర్ అనే వ్యక్తి నరమేధం సృష్టించాడు. భార్య పుట్టింటికి వెళ్తోందనే కోపంతో.. ఏకంగా ఏడుగురిని దారుణంగా హత్య చేశాడు. ఇంతకీ ఏడు హత్యలో ఎలా చేశాడో తెలిస్తే మీరు షాక్‌కు గురవుతారు.

Bengaluru 7 Murders: సినిమాల్లో కూడా ఊహించని ట్విస్టులు ఉంటాయి. కానీ కర్ణాటకలో జరిగిన ఈ ఘటన తెలిస్తే మాత్రం ఒళ్లు గగుర్పొడవాల్సిందే. భార్య తన మాట వినడం లేదని, తరచూ పుట్టింటికి వెళ్తోందని ఓ భర్త ఏకంగా ఆమె కుటుంబాన్నే అంతం చేశాడు. ఒకరి తర్వాత మరొకరిని పక్కా పథకం ప్రకారం హత్య చేస్తూ ఏడుగురి ప్రాణాలు తీశాడు. బావమరుదలను అయితే పార్టీ ఇస్తాను రండి అని ఇంటికి పిలిచి మరీ ప్రాణాలు తీసేశాడు. ఏడు హత్యల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. బెంగళూరులోని శ్రీరాంపుర ప్రాంతానికి చెందిన ఇందుశేఖర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సుమారు 20 ఏళ్ల క్రితం సునీతను పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లైన కొంతకాలం నుంచే భార్య పుట్టింటికి వెళ్లడంపై ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. సునీత తరచూ పుట్టింటికి వెళ్లడాన్ని శేఖర్ సహించలేకపోయేవాడు. ఈ విషయంలో కుటుంబ సభ్యులు సర్దిచెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. పైగా సునీతకు ఆమె తల్లి, సోదరులు అండగా నిలవడంతో శేఖర్ వారిపై కూడా కక్ష పెంచుకున్నాడు.
హత్య చేయాలని నిర్ణయం తీసుకున్న శేఖర్
చివరకు ఓ భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. తన భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులందరినీ అంతం చేయాలని పథకం రచించాడు. ప్లాన్ ప్రకారం ముందుగా భార్య సునీతను రోకలితో కొట్టి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని దుప్పటితో చుట్టి కారులో నంది హిల్స్ సమీపానికి తీసుకెళ్లి పడేశాడు. ఆమె ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి, సునీత యాత్రకు వెళ్లిందంటూ చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా భార్యకు వత్తాసు పలుకుతున్నారనే కోపంతో బావమరుదులను చంపేందుకు స్కెచ్ వేశాడు శేఖర్. బావమరుదులు శివకుమార్, శంకర్‌లను విందు పేరుతో ఇంటికి ఆహ్వానించాడు. వారితో కలిసి మద్యం సేవించిన అనంతరం రోకలితో కొట్టి ఇద్దరినీ హత్య చేశాడు. ఆ తర్వాత వారి కుటుంబాలపై కూడా విరుచుకుపడ్డాడు. శివకుమార్ భార్య దివ్య, శంకర్ భార్య నళిని, తన అత్త రూపవతిని హతమార్చాడు. చివరకు శివకుమార్ ఏడేళ్ల కుమారుడు పునీత్‌ను కూడా విడిచిపెట్టలేదు. ఇలా భార్య సునీతతో మొదలైన హత్యల పరంపర.. ఆమె కుటుంబంలోని మరో ఆరుగురి ప్రాణాలను బలిగొంది.
ఒక్క ఫిర్యాదుతో బయటపడిన అసలు వ్యవహారం
అయితే ఈ దారుణాలు వెంటనే వెలుగులోకి రాలేదు. నళిని తల్లి తన కుమార్తె కనిపించడం లేదంటూ శ్రీరాంపుర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు కథ బయటపడటం మొదలైంది. పోలీసులు దర్యాప్తు చేపట్టి ఒక్కొక్క విషయాన్ని వెలికితీశారు. చివరకు శేఖర్‌పై అనుమానాలు బలపడటంతో అతడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఏడుగురిని ఎందుకు చంపావని పోలీసులు ప్రశ్నించగా.. తన భార్య తన మాట వినడం లేదని, తరచూ పుట్టింటికి వెళ్తోందని చెప్పినట్లు విచారణలో వెల్లడైంది. ఒక చిన్న కుటుంబ గొడవ.. చివరకు ఏడు ప్రాణాలను బలిగొన్న దారుణ ఘటనగా మారింది. ప్రస్తుతం పోలీసుల రిమాండ్‌లో ఉన్న శేఖర్‌ని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.
#WATCH | Karnataka: Bengaluru City Police Commissioner Seemanth Kumar Singh says, “There was a missing case registered stating that some of their relatives have been missing for a few days. Based on that, the missing case was registered and subsequently they had doubts about some of their own relatives. The police have arrested a person who claims that, within a span of 15 to 20 days, which is subject to verification, he has murdered seven people. All of them are his relatives. More so, he has murdered his wife and all relatives of his wife. All six to seven persons are relatives of his wife, belonging to two families. This is a very, very serious offence that has happened within the family. One minor has been murdered along with six other people. We are verifying from all angles how it happened. He is giving a version that he called them one by one, murdered them, and disposed of the bodies in places he has indicated; we are verifying this with the district SPs of those areas. Six bodies have yet to be found as per the information provided by the accused…”
— ANI (@ANI) November 6, 2026



