కాటేస్తున్న డీజే.. పిట్టల్లా రాలుతున్న జనం
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాదారంలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో డీజే సౌండ్‌కి గుండె పోటుతో అప్పల నరసింహపురం గ్రామానికి చెందిన యలగాల భారతి మృతి (55) చెందారు. విపరీతమైన డీజే సౌండ్‌తోనే భారతి గుండెపోటుకు గురైందని స్థానికులు ఆరోపిస్తున్నారు

Telangana Bathukamma Tragedy:
తెలంగాణ ఆడపడుచులు సంతోషంగా జరుపుకునే బతుకమ్మ వేడుకల్లో పలుచోట్ల విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. పలుచోట్ల సద్దుల బతుకమ్మ వేడుకలు విషాదంతమయ్యాయి. ఖమ్మం జిల్లాలో ఒక మహిళ డీజే సౌండ్స్‌తో గుండెపోటుకు గురై మృతి చెందగా.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం బూరుగూడ గ్రామంలో సేమ్ సిచ్వేషన్ చోటుచేసుకుంది. బతుకమ్మ ఆడుతూ శ్రీవాణి(25) అనే యువతి ఒక్కసారిగా కుప్పకూలింది. ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయింది (Telangana Bathukamma Tragedy). కార్డియాక్ అరెస్ట్‌తో యువతి శ్రావణి మరణించినట్లు డాక్టర్లు చెప్పారు.
చింతమానేపల్లి మండలం బాబాసాగర్ గ్రామానికి చెందిన శ్రీవాణి బతుకమ్మ సంబరాల కోసం మేనత్త ఇంటికి బూరుగూడ గ్రామానికి వెళ్లింది. ఆదివారం రాత్రి బతుకమ్మ ఆడుతుండగా ఒక్కసారిగా పడిపోయింది. వెంటనే పక్కన ఉన్నవారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయారని చెప్పారు డాక్టర్లు. 25ఏళ్లకే శ్రీవాణి మృతి చెందడం కలవరపాటుకు గురిచేసింది. హైదారాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో డిగ్రీ లెక్చరర్‌గా పనిచేస్తుంది. యువతి మృతితో బూరుగూడ గ్రామంలో విషాదం నెలకుంది.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాదారంలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో డీజే సౌండ్‌కి గుండె పోటుతో అప్పల నరసింహపురం గ్రామానికి చెందిన యలగాల భారతి మృతి (55) చెందారు. విపరీతమైన డీజే సౌండ్‌తోనే భారతి గుండెపోటుకు గురైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. డీజే సౌండ్స్‌పై ఆంక్షలు విధించాలని కోరుతున్నారు. దసరా పండుగ వేళ మహిళ మృతితో అప్పల నరసింహపురంలో విషాదం నెలకుంది (Telangana Bathukamma Tragedy).
కామారెడ్డి జిల్లాలో బతుకమ్మ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. బిక్కనూర్ మండలం తిప్పాపూర్‌లో చెరువులో బతుకమ్మ నిమజ్జనం చేస్తుండగా ధర్మగుళ్ల స్వామి అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు. దీంతో గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఆగిపోయాయి.



